leonia resorts managing director chakravarthy raju arrested బ్యాంకులకు శఠగోపం.. లియోనియా రిసార్ట్స్ ఎండీ అరెస్ట్

Leonia resorts managing director arrested in bad debts case

CBI, chakravathy raju, indian overseas bank, bad debts case, leonia resorts managing director, leonia resorts, shamirpet, telanagana

After indian overseas bank officials approach central bereau of investigation (CBI), the sleuths from karnataka came to hyderabad and arrested leonia resorts managing director chakravarthy raju in bad debts case.

బ్యాంకులకు శఠగోపం.. లియోనియా రిసార్ట్స్ ఎండీ అరెస్ట్

Posted: 01/18/2018 09:42 AM IST
Leonia resorts managing director arrested in bad debts case

బ్యాంకులకు వేల కోట్ల రూపాయల శఠగోపం పెట్టి విదేశాలకు తరలివెళ్లిన కింగ్ ఫిషర్ గ్రూప్ సంస్థల అధినేత విజయ్ మాల్యా ఘటన వెలుగుచూసిన తరుణంలోనే ఇలాంటి మార్గంలోనే పయనిస్తున్న బడాబాబులు ఏకంగా వేల సంఖ్యలో వున్నారని, వారి నుంచి దేశీయ బ్యాంకులకు సుమారుగా లక్ష కోట్లకు పైగా డబ్బులు రావాల్సి వుందన్న గణంకాలు కూడా వెలుగుచూసిన క్రమంలో.. ఇక బ్యాంకులు కూడా ఇలాంటి బడాబాబులపై కేసులు నమోదు చేసేందుకు రెడీ అవున్నాయి.

అందులో భాగంగానే హైదరాబాద్ శివార్లలోని శామీర్ పేటలో ఉన్న లియోనియా రిసార్ట్స్ ఎండీ చక్రవర్తిరాజును కర్ణాటక సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించారు. మొదట్లో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన.. తీరా వచ్చి అరెస్టు చేసింది కర్ణటాక సీబిఐ అధికారులని తెలియడంతో సంచలనంగా మారింది. కర్ణాటకలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి రూ. 432.22 కోట్లను రుణంగా తీసుకున్న చక్రవర్తి రాజు ఏళ్లు గడుస్తున్నా వాటిని చెల్లించలేదు. ఇక అసలుకన్నా వడ్డీ ముద్దు అనే బ్యాంకులకు వడ్డీకి కూడా శఠగోపం పెట్టాడు.

దీంతో రంగంలోకి దిగిన ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకు ఉన్నాతాధికారులు అయనకు రుణాలను తిరిగి చెల్లించాలని ఎన్నో పర్యాయాలు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఇక బ్యాంకు ఉన్నతాధికారులు అయనను సంప్రదించాలని పలు మార్లు చేసిన ప్రయాత్నాలు కూడా.. చక్రవర్తిరాజు అందుబాటులో లేకపోవడంతో, విఫలమయ్యాయి. దీంతో బ్యాంకు అధికారులు సీబీఐని ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ, మార్చి 2015లో కేసు నమోదు చేసింది. తప్పుడు పత్రాలను బ్యాంకుల్లో తనఖా పెట్టి ఆయన డబ్బు తీసుకున్నట్టు తేల్చింది. తదుపరి విచారణ నిమిత్తం చక్రవర్తిరాజును అరెస్ట్ చేస్తున్నట్టు పేర్కొంటూ, ఆయన్ను బెంగళూరు తరలించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles