Telangana techie run over by truck in US అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలుగు టెక్కీ దుర్మరణం

Telangana techie dies in miami after being hit by speeding truck

Telangana techie killed in US, telangana news, Miami Indian techie death, Indian techie killed in US, Bharath Reddy death, Dolphines Cancer Challenge race, road mishap indian techie, telanagana

A techie from Telangana was killed in road accident as he was cycling in Miami in the United States. Narahari Bharath Reddy hailed from Karimnagar, and was reported to be the younger son of PRTU State leader Narahari Laxma Reddy.

అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలుగు టెక్కీ దుర్మరణం

Posted: 01/18/2018 09:02 AM IST
Telangana techie dies in miami after being hit by speeding truck

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ మృత్యువాత పడ్డాడు. దక్షిణ ఫ్లోరిడాలోని మియామీలో జరిగిన రోడ్డుప్రమాదంలో కరీంనగర్‌ జిల్లావాసి నరహరి భరత్ రెడ్డి(37) మృతి చెందాడు. పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మారెడ్డి రెండో కుమారుడు భరత్ రెడ్డి. దీంతో పండగ పర్వదినాన వారింట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

స్నేహితులతో కలిసి సైక్లింగ్‌ చేస్తుండగా సైకిళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో చివరలో ఉన్న భరత్‌రెడ్డి రోడ్డు డివైడర్‌ను ఢీకొని కింద పడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ ట్రక్కు అతడిపై నుంచి దూసుకెళ్లడంతో.. ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. అథ్లెటిక్స్‌ పోటీల్లో అత్యంత ప్రతిష్ఠాత్మక ‘ఐరన్‌మ్యాన్‌’ అవార్డు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని పదేళ్లుగా కఠోర సాధన చేసిన.. పోటీలకు సరిగ్గా మూడు రోజుల ముందు మృత్యువు ఒడిలోకి వెళ్లిపోయాడు
 
ఘటన సంభవించగానే సహచరమిత్రులు తీవ్ర గాయాలపాలైన భరత్ రెడ్డిని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ప్రమాదంలో మరో సైక్లిస్ట్ కూడా గాయపడ్డాడు. భరత్‌రెడ్డి మృతిపై టీం హామర్ హెడ్స్ మేనేజ్‌మెంట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసుకున్న అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana techie  Bharath Reddy  america  miami  road mishap  athlete  cycling  US  telangana  

Other Articles