Man dies after bike falls into manhole మాన్ హోల్ లో పడి వ్యక్తి సజీవదహనం

Man charred to death after bike falls into manhole

Mohan Rathod, gym trainer death, Talwalkar gym, homicide, culpable, Burn injuries, accident, manhole, Ulwe, maharastra

A motorcycle-borne man allegedly fell into an open manhole near Ulwe sector 20 and died due to an ensuing explosion

మాన్ హోల్ లో పడి యువకుడి సజీవదహనం

Posted: 01/17/2018 08:22 PM IST
Man charred to death after bike falls into manhole

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో దారుణం జరిగింది. మ్యాన్ హోల్ లో ద్విచక్రవాహనంతో సహా పడిపోయిన ఓ యువకుడు సజీవ దహనమయ్యాడు. పడిపోయిన తర్వాత బైక్ నుంచి పెట్రోల్ లీక్ కావడం.. అకస్మాత్తుగా మంటలు అంటుకుని ఒక్క ఉదుటున వ్యాపించడంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మంగళవారం వేకువ జామున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఉల్వే ప్రాంతానికి చెందిన మోహన్ రాథోడ్ అనే వ్యక్తి సోమవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి పక్కనే ఉన్న మ్యాన్ హోల్ లో బైక్ తో సహా పడిపోయాడు. ఆ వెంటనే బైక్‌ నుంచి మంటలు రావడంతో అతడు మ్యాన్ హోల్ లోనే సజీవదహనమయ్యాడు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ ప్రమాదాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు అక్కడికి వచ్చే లోపే మోహన్‌ మృతిచెందాడు.

మురుగుకాలువ పైప్‌లైన్‌ నిర్మాణం, రోడ్డు నిర్మాణం జరుగుతుండటం వల్ల మ్యాన్ హోల్ ను మూసివేయలేదని అధికారులు తెలిపారు. అంతేగాక.. ఘటన సమయంలో మోహన్ మద్యం సేవించి ఉన్నట్లు తెలిసిందని పోలీసులు వెల్లడించారు. కాగా యువకుడు మోహన్ స్థానికంగా వున్న తల్వారకర్ జిమ్ లో ట్రైనర్ గా విధులు నిర్వహిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. మోహన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : homicide  culpable  Burn injuries  accident  manhole  Ulwe  maharastra  

Other Articles