Railways identifies 9 ‘danger zones’ unsafe for women అమ్మాయిలు ఇవే డేంజర్ జోన్లు.. రాకపోకల్లో జర భద్రం..

Railways identifies 9 danger zones unsafe for women

Dangerous, Danger Zones, Railway Stations, women, women’s safety, Western Line, Railway Police Force, Molestation, ladies compartment, Central line, BMC, molest, railway police, mumbai, maharashtra

With the number of molestation cases increasing exponentially on the suburban railway network, the Railways has identified several lacunae in the logistical and security setup at railway stations across the three railway lines.

అమ్మాయిలు ఇవే డేంజర్ జోన్లు.. రాకపోకల్లో జర భద్రం..

Posted: 01/17/2018 12:44 PM IST
Railways identifies 9 danger zones unsafe for women

దేశ అర్థిక రాజధానిగా బాసిలుతున్న ముంబై మహానగరంలోని అమ్మాయిలు, యువతులు, మహిళలకు అక్కడి పోలీసులు కొన్న కీలక సూచనలు చేశారు. రాత్రింబవళ్లు ఏకం చేసేలా సాప్ట్ వేర్ కంపెనీల రాకతో పగలు రేయి తేడా లేకుండా కార్యాలయాల్లో కష్టపడి ఇళ్లకు చేరుకునేందుకు చివరకు సబర్బన్ రైల్వేస్టేషన్లను అశ్రయించేవారి కోసం ముఖ్యంగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

రాత్రి వేళ్లలో మహిళలపై ఆకతాయిల వేధింపుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో సబర్బన్ రైల్వేస్టేషన్లకు చేరుకునే ప్రాంతాల్లో తొమ్మిది డేంజర్ జోన్లను గుర్తించారు. ఈ దారుల్లో రాకపోకలు సాగించేప్పుడు యువతులు, మహిళలు జర జాగ్రత్తగా ఉండాలని రైల్వే పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. అయితే పోలీసులు గుర్తించిన దారుల్లో తమ వంతుగా కూడా పలు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

ముఖ్యంగా దాదర్, చర్చ్ గేట్, అంథేరి, కల్యాణ్ రైల్వేస్టేషన్లలో అమ్మాయిలను వేధించకుండా అదనపు భద్రతా బలగాలను మోహరింపచేసిన పోలీసులు పలువరుని మఫ్టీలో కూడా విధులు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. దాదర్ రైల్వేస్టేషనులో ఓవర్ బ్రిడ్జీ, అంధేరి స్టేషనులోని ఇరుకు మెట్ల వంతెన, దాదర్ లోని స్కైవాక్ ల వద్ద కొందరు ఆగంతకులు ఒంటరి మహిళలను వేధిస్తున్నారని తమకు ఫిర్యాదులు అందటంతో ఆయా ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు, అదనంగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి పోలీసులను నియమించామని అధికారులు చెప్పారు.

అంధేరి స్టేషనులో ఉన్న ఇరుకు వంతెనలపై ఆకతాయిలు మహిళలను టచ్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నారని తమకు ఫిర్యాదులు వచ్చాయని రైల్వే పోలీసులు చెప్పారు. రాత్రివేళల్లో పదిగంటల సమయం దాటాక సబర్బన్ రైళ్లలో మహిళలు ప్రయాణించడం మరింత ప్రమాదకరమని రైల్వే పోలీసులు హెచ్చరించారు. ఫ్లాట్ ఫాంలతోపాటు మహిళా బోగీల్లో మహిళా పోలీసులను నియమిస్తున్నట్లు అధికారులు వివరించారు. రైల్వే వంతెనలు, ప్లాట్ ఫాంలు, మహిళా బోగీల్లో యువకులు వేధిస్తున్నందున అప్రమత్తమై రక్షణ చర్యలు చేపట్టినట్లు రైల్వే పోలీసులు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dangerous  Danger Zones  Railway Stations  women  molest  railway police  mumbai  maharashtra  

Other Articles