girl hulchul in jubilee hills after caught in drunk and drive మద్యం మత్తులో పోలీసులపై యువతి చిందులు

Woman hulchul in jubilee hills after caught in drunk and drive

drunk and drive, hyderabad police drunk and drive check, jubilee hills check post police check, girl hulchul at jubilee hills, woman hulchul at jubilee hills, crime

A girl riding a car caught in hyderabad police drunk and drive check, creates hulchul at jubilee hills checkpost.

ITEMVIDEOS: మద్యం మత్తులో పోలీసులపై యువతి చిందులు

Posted: 01/17/2018 09:18 AM IST
Woman hulchul in jubilee hills after caught in drunk and drive

సంక్రాంతి పర్వదినం రోజున అమాయక వాహనచోదకుల ప్రాణాలు గాల్లో కలవకుండా వుండేందుకు పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇందులోభాగంగా మద్యం మత్తులో వాహనాలను నడిపే వాహనదారులను కట్టడి చేసేందుకు అనేక చోట్ల పోలీస్ చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. పండగ అంటేనే మద్యం సేవించడం అని భావించిన పలువురు వాహనదారులు.. మద్యం మత్తులో రోడ్డేక్కడంతో వారిపై పోలీసులు కేసులు బనాయించారు.

పండగ రోజున నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా ఏకంగా 59 మంది వాహనదారులు పట్టుబడ్డారు. వీరిలో 34 కార్లు, 25 బైకులు వుండగా, వాహనాలను అధికారులు సీజ్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసు తనిఖీల్లో దోరికిన వారిలో 10 మంది మహిళలే వుండటం గమనార్హం. కాగా, చెక్ పోస్టుకు సమీపంలోని చిరంజీవి బ్లడ్ బ్యాంకు వద్ద పూటుగా మద్యం తాగి, కారు నడుపుకుంటూ వచ్చిన ఓ యువతి పోలీసులను ముప్పు తిప్పలు పెట్టింది.

యువతి హల్ చల్ కు తొలుత బిత్తరపోయిన అధికారులు.. అమెకు ఎలాగైనా బ్రీత్ ఎనలైజర్ టెస్టు నిర్వహించాలని ప్రయత్నించారు. అయితే యువతి మాత్రం టెస్టుకు సహకరించకుండా కారు తాళాలు తీసుకుని రోడ్లపై పరుగు తీసింది. తనకు పెద్దలు తెలుసునంటూ, వారితో ఫోన్లు చేయించింది. అతి కష్టం మీద ఆమెను అదుపు చేసిన పోలీసులు, చివరకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు జరిపి మోతాదుకు మించి మందు కొట్టినట్టు తేల్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : drunk and drive  hyderabad police  jubilee hills  girl hulchul  woman hulchul  crime  

Other Articles