Cabinet ministers should 'speak up' like SC judges: Yashwant క్యాబినెట్ మంత్రులకు యశ్వంత్ హితువు

Cabinet ministers should speak up like sc judges yashwant sinha

bjp senior leader, former finance minister, yashwant sinha, cabinet ministers, sc judges, PM Modi, cji deepak mishra, prime minister, narendra modi, emergency, politics

BJP leader Yashwant Sinha asked his party colleagues and ministers to "get rid of their fear" and "speak up for democracy" like the four Supreme Court judges who came out publicly against the chief justice.

వారికున్న అందోళన మీలోనూ వుంటే గొంతు విప్పండీ..!

Posted: 01/13/2018 04:04 PM IST
Cabinet ministers should speak up like sc judges yashwant sinha

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై మరోమారు బీజేపి సీనియర్ నేత, మాజీ అర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా పరోక్ష విమర్శలు ఎక్కుపెట్టారు. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీకోర్టు న్యాయమూర్తులను అదర్శంగా తీసుకుని కేంద్రంలోని క్యాబినెట్ మంత్రులు కూడా తమ గళాన్ని వినిపించాలని ఆయన సూచనలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నలుగురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చిన రీతిలోనే పార్టీ ఎంపీలు, కేబినెట్ మంత్రులు తమ భయాలను పక్కనపెట్టి ప్రజాస్వామ్యంపై మాట్లాడేందుకు ముందుకు రావాలని హితవు పలికారు.

ప్రస్తుత పరిస్థితులు 1975-77లోని ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని నలుగురు జడ్జిలు చేసిన వ్యాఖ్యలపై యశ్వంత్ సిన్హా స్పందిస్తూ, పార్లమెంటు రాజీ పడితే సుప్రీంకోర్టు సరైన రీతిలో నడవకుంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని అన్నారు. ప్రజాసామ్యానికి ముప్పు పొంచి ఉందని సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిలు చెప్పినప్పుడు వారి మాటలను క్యాబినెట్ మంత్రులు సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. అప్రజాస్వామికంగా జరుగుతున్న అన్ని చర్యలను ఎండగట్టాలని, అందుకు ప్రతి పౌరుడికి మాట్లాడే హక్కు వుందని అన్నారు.

బీజేపీ నేతలు, సీనియర్ కేబినెట్ మంత్రులనూ మాట్లాడాలని తాను కోరుకుతున్నానన్నారు. భయాలన్నీ పక్కనపెట్టి నోరు విప్పాలని ఆయన అన్నారు. 'ఈ ప్రభుత్వంలో భయంతో పని చేస్తున్న కేబినెట్ మంత్రుల గురించి నాకు తెలుసు. భయం గుప్పిట్టో పనిచేయడం కూడా ప్రజాస్వామ్యానికి ముప్పే' అని ప్రభుత్వంపై యశ్వంత్ సిన్హా విమర్శలు గుప్పించారు. సిన్హా గతంలోనూ మోదీ సర్కార్ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, జీఎస్టీపైనా ఘాటు విమర్శలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yashwant sinha  cabinet ministers  sc judges  PM Modi  cji deepak mishra  emergency  politics  

Other Articles