hyderabad police burst hitech prostitution racket హెటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు..

Hyderabad police burst hitech prostitution racket

prostitution in hyderabad, prostitution in banjara hills, hitech prostitution in banjara hills, banjara hills guest house prostitution, hitech prostitution, banjara hills, guest house, hyderabad police, crime

The hyderabad police acted on the tip of the information, raided a guest house and arrested the organiser along with 4 women including a russian national

హెటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు..

Posted: 01/13/2018 12:59 PM IST
Hyderabad police burst hitech prostitution racket

పండుగ వేళ ఎవరికి వారు సంబరాల్లో మునిగి తేలేందుకు సిద్దమవుతున్న క్రమంలో.. సందేట్లో సడేమియాలు మాత్రం తమ వ్యాపారాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకుంటున్నారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఎక్కడికక్కడ దాడులు చేసినా.. ఎన్నో కొత్త రూపాల్లో అలసటలేని సంపాదనను అర్జించేందుకు ప్లాన్ చేస్తూన్నారు. ఇంతకీ వీరు చేస్తున్న వ్యాపారమేంటో తెలుసా..? వ్యభిచారం.

గతంలో క్లాస్టీ అపార్టుమెంట్లను అద్దెకు తీసుకుని వ్యభిచార గృహాలను నిర్వహించిన పోలీసులకు అడ్డంగా దొరికిపోవడంతో.. ఇక ఈ సారి పాష్ ఏరియాల్లోని గెస్ట్ హౌజ్ లనే కేంద్రాలుగా చేసుకుని హైటెక్ వ్యభిచారానికి తెరలేపారు. హైదరాబాద్‌లో మరో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయింది. బంజారాహిల్స్ లోని ఓ గెస్ట్ హౌస్ లో పెద్ద ఎత్తున వ్యభిచారం జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు గెస్ట్ హౌస్ పై దాడిచేశారు.

ముఠా నిర్వాహకుడు, మరో యువకుడు, రష్యన్ యువతితో పాటు మరో ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.నిర్వాహకుడిని తమిళనాడుకు చెందిన అలెక్స్ (40)గా గుర్తించారు. పోలీసుల అదుపులో ఉన్న వారిలో యువకుడు బీహార్‌కు చెందిన పంకజ్ కుమార్ మండల్ కాగా, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహిళ, యువతులు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతులను సంరక్షణ గృహానికి పంపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hitech prostitution  banjara hills  guest house  hyderabad police  crime  

Other Articles