court sentences two years jail term for mlc ఈ తీర్పు చాటింది.. చట్టం కాదు ఎవరికీ చుట్టం..

Court sentences two years jail term for mlc srinivas reddy

guduru court, mlc sentenced for two years, yandapally srinivas reddy, two years jail term for mlc, gudur circle inspector rambabu, crime

guduru court sentences mlc yandapally srinivas reddy and ten other for two years jail term for attacking and manhandling gudur circle inspector.

ఎమ్మెల్సీకి రెండేళ్ల జైలు.. జరిమానా..

Posted: 01/13/2018 11:59 AM IST
Court sentences two years jail term for mlc srinivas reddy

అధికారంలో వున్నవారైనా, విపక్షంలో వున్నవారైనా కేసులు పెట్టిన తరువాత మాత్రం చట్టం చట్రం నుంచి తప్పించుకోలేరు. ఎవరికీ చట్టం చుట్టం కాదు అని మరోమారు రుజువైంది. విధినిర్వహణలో ఉన్న సీఐపై దాడికి పాల్పడిన కేసులో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డితో పాటు మరో 10 మందికి రెండేళ్ల జైలు శిక్ష పడింది.

నెల్లూరు జిల్లా గూడూరు అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లావణ్య 2011 నాటి కేసును విచారణ తరువాత ఇవాళ తీర్పును వెలువరిస్తూ దోషులకు జైలు శిక్షతో పాటు జరమనా కూడా విధించింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. 2011 అక్టోబర్ 3న అంకులపాటూరులో వీఎస్ఎఫ్ అనే కంపెనీ ఏర్పాటు చేయాలనుకున్న విద్యుత్ పరిశ్రమ కోసం ప్రజాభిప్రాయ సేకరణను అప్పటి తహసీల్దార్ రోజ్ మాండ్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా, పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా కొందరు ఆందోళన చేపట్టారు.

ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి గూడూరు సీఐ రాంబాబుపై పలువురు అందోళనకారులు దాడి చేసి గాయపరిచారు. దీంతో, అప్పట్లో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, 12 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో, వీరిపై నేరారోపణలు రుజువు కావడంతో, ఒక్కొక్కరికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 4,700 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ 12 మంది నిందితుల్లో ఒకరు ఇప్పటికే చనిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : guduru court  mlc  sentence  two years  yandapally srinivas reddy  gudur ci rambabu  crime  

Other Articles

 • Jaswant singh s son manvendra singh joins congress ahead of elections

  అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపికి షాక్..

  Oct 17 | రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7న జరుగనున్న నేపథ్యంలో అధికార బీజేపి నేతృత్వంలోని వసుంధర రాజే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపి మాజా సినియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ తనయుడు... Read more

 • Ap cops go to tn village to arrest criminal villagers lock them inside house

  దొంగల వెంటపడ్డారు.. గ్రామస్థులకు బంధీలయ్యారు..

  Oct 17 | దొంగలు, దోపిడీ ముఠాల నాయకులను పట్టుకునేందుకు పోలీసులు చేపట్టే ఆపరేషన్లు అంత సజావుగా సాగవు. చాలాసార్లు పోలీస్ అధికారుల నుంచి దొంగలు తప్పించుకుంటారు. ఈ క్రమంలో దొంగల ముఠా నుంచి పోలీసులకు అనేక సవాళ్లు... Read more

 • Metoo mj akbar resigns 10 days after sexual harassment allegations

  ఎట్టకేలకు మంత్రి పదవికి ఎంజే అక్బర్ రాజీనామా

  Oct 17 | ‘మీటూ’ ఉచ్చులో చిక్కుకున్న కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్.. తనపై వస్తున్న అరోపణలను తోసిపుచ్చినా.. ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ... Read more

 • Protests near sabarimala turn violent 2 female journalists injured

  శబరిమల వద్ద ఉద్రిక్తత.. మహిళా జర్నోలపై దాడి

  Oct 17 | దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఇవాళే తొలిసారిగా కేరళలోని అయ్యప్పస్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. అయితే ఆలయంలోకి ప్రవేశించేందుకు అన్ని వయసుల మహిళలకు అనుమతినిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించడంతో తాము... Read more

 • Ramulu naik dares ktr on suspending allegations

  నిజమెవ్వరిదో తేల్చుకుందామా కేటీఆర్: రాములు నాయక్ సవాల్

  Oct 17 | పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పార్టీ ఏర్పాటు నుంచి అన్ని వేళలా వెన్నంటే వుంటూ వచ్చిన తనపై టీఆర్ఎస్ అధిష్టానం వేటు వేయడాన్ని జీర్ణంచుకోలేని ఎమ్మెల్సీ రాములు నాయక్ టీఆర్ఎస్ పార్టీతో పాటు... Read more

Today on Telugu Wishesh