hyderabadis went to native, police security beeed up నగరవాసి పల్లె పయనం.. పోలీసుల గస్తీ ముమ్మరం..

Hyderabadis went to native police security beeed up

sankranti, pongal, hyderabadis, native villages, andhra, cock fight, police, hyderabad police, police security theft cases, Telangana, crime

As the hyderabadis went to their natives to celebrate pongal festival.. all most city is been vacant. this made police to make neccessary arragnements in view of chadi, baniyan gang thives.

పల్లెకు నగరవాసి.. ముమ్మరమైన పోలీసు గస్తీ..

Posted: 01/13/2018 11:11 AM IST
Hyderabadis went to native police security beeed up

ఉదయాన్నే బోగి మంటలు, బందువులు, మిత్రులు, శ్రేయోభిలాషుల పలకరింపులు క్షేమసమాచారాలు ఆ తరువాత అభ్యంగన స్నానాలు.. ఇక ఊరూ వాడా అంత ఒక్క చోట చేరి సరదాగా అటలు అడుకునే సంప్రదాయకర పండుగ రోజును ఎవరు మాత్రం వదులుకుంటారు. ఇందుకోసం ఏకంగా ఖర్చుకోసం కూడా వేచిచూడకుండా ప్రయాణాలు సాగిస్తుంటారు. తమ వారిని ముందుగానే పంపించి.. తాము మాత్రం బోగి రోజుకు ముందు చేరుకునేలా ప్లాన్ చేసుకుంటారు. ఈ హడావిడి కనిపించేంది కేవలం సంక్రాంతి పండుగ రోజున మాత్రమే,  

ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో ఉద్యోగాలు, వ్యాపార రిత్యా కూడా స్థిరపడినవారు పల్లెలకు జాంజామని పరుగులు తీయడం తెలిసిందే. దీంతో ఏడాది పోడవునా ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యే భాగ్యనగరపు రహదారులు.. ఈ పర్వదినపు సెలవుల నేపథ్యంలో కాసింత విశ్రాంతి తీసుకుంటాయి. ఇక ఊళ్లకు వెళ్లే వారితో గత వారం రోజులుగా కిక్కిరిసిపోతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు శుక్రవారం జాతరను తలపించాయి. పండుగ సమయం దగ్గరపడడంతో ఇళ్లకు వెళ్లే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.

దీంతో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు నడుస్తున్న 3500 రెగ్యులర్ బస్సులకు అదనంగా మరో 3650 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. కొందరు పండుగ రద్దీని తట్టుకోలేక సొంత వాహనాలను ఆశ్రయించారు. గత నాలుగు రోజుల నుంచి ఇప్పటి వరకు 15 లక్షలమందికి పైగా పల్లె బాట పట్టారు. మరో ఐదు లక్షలమంది సొంతూళ్లకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే రైళ్లు, బస్సులలో సీట్లు లభించని వాళ్లు సొంత వాహనాలలో కూడా సొంతూళ్లకు పరుగులు పెడుతున్నారు.

ఇక మరోవైపు సెలవుల నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి నగరవాసులు సొంతూళ్లకు వెళ్లిన క్రమంలో ఈ సమాచారం తెలుసుకున్న దొంగలు దోపిడీలకు, దొంగతనాలకు పాల్పడే అవకాశముంది. ఈ క్రమంలో పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే బలియన్ దొంగల గ్యాంగ్ ఓ వైపు చెడ్డీ దోంగల గ్యాంగ్ మరోవైపు దొంగతనాలకు పాల్పడుతూ నగరవాసులలో భయాందోళన కలగజేస్తున్న క్రమంలో పోలీసులు ముమ్మరంగా నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sankranti  pongal  hyderabadis  native villages  andhra  cock fight  police  hyderabad police  

Other Articles

 • Women can buy bikes at 50 subsidy under amma scheme in tamil nadu

  సగం ధరకే టూవీలర్.. అయినా ఆదరణ కరువు..

  Jan 23 | సగం ధరకే ద్విచక్రవాహనాలను అందజేస్తామని ప్రకటన ఇచ్చి కౌంటర్లను ఏర్పాటు చేసినా.. తమళనాడులో మహిళలు పెద్దగా అసక్తిని కనబర్చడం లేదు. ఇందులో కూడా ఏదైనా మోసం వుందా..? అందుకనే వారు వెనకంజ వేస్తున్నారా..? అన్న... Read more

 • Actor praful bhalerao falls to death from train in mumbai

  రైలు ప్రమాదంలో విషాదం.. నటుడి దుర్మరణం

  Jan 23 | చిత్రపరిశ్రమలో బాలనటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి.. అటు సినీ, ఇటు బుల్లితెర మరాఠీ ప్రేక్షకులను అలరించిన నటుడు ప్రఫుల్ భలేరావు రైలు ప్రమాదంలో మరణించాడు. అప్పటికే కదిలిన రైలును ఎలాగైనా ఎక్కాలన్న తొందరలో ఇరవై... Read more

 • Shiv sena decides to end ties with bjp says will fight for hindutva

  దశాబ్దాల మైత్రికి బ్రేక్.. ఒంటరిపోరుకు సై అంటున్న శివసేన

  Jan 23 | శివసేస పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో అధికారంలో వున్న నరేంద్రమోడీ ప్రభుత్వంతో తాము కలసి నడవలేమని ఇదే విధానాన్ని తాము రానున్న ఎన్నికలలోనూ అమలు చేస్తామని తేల్చిచెప్పింది. అధికారంలో వున్నా.. లేక విపక్షంలో... Read more

 • Pawan kalyan calls for long time war in karimnagar

  ITEMVIDEOS: సుదీర్ఘపోరాటానికి సిద్దంకండీ: సమన్వయకర్తలకు పవన్ పిలుపు

  Jan 23 | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు వేరైనా అందరం భారతీయులమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దేశం కోసం తన గుండె కొట్టుకుంటుందని అన్నారు. పాలకుల ప్రాంతీయ అసమానతల పాలన వల్ల ప్రాంతీయ విభేదాలు తెరపైకి... Read more

 • Pawan kalyan explains janasena idealogies at karimnagar

  జనసేన సిద్దాంతాలు చెప్పిన పవన్ కల్యాన్

  Jan 23 | జనసేన పార్టీ స్థాపించి.. ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి తొలిసారిగా దిగుతున్న క్రమంలో జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ పార్టీ సిద్దాంతాలను సమన్వయకర్తలకు వివరించారు. కరీంనగర్ లోని శుభం గార్డెన్స్ లో... Read more

Today on Telugu Wishesh