TRS MLA Srinivas goud too travels in nayini way నాయిని బాటలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్..

Trs mla srinivas goud too travels in nayini way

KCR, Nayani Narasimha Reddy, srinivas goud sensational comments, trs mla srinivas goud, former employees jac leader, mla srinivas goud, Nayani sensational comments, nayini filthy language, MLAs, parlaiament members, Telangana, policitics

After Telangana home minister Nayini Narasimha Reddy, Mla Srinivas Goud too follows the same track. Former Employees JAC leader says betrayls and conmen are in TRS cabinet.

నాయిని బాటలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్..

Posted: 01/13/2018 10:09 AM IST
Trs mla srinivas goud too travels in nayini way

తెలంగాణ రాకుమునుపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బండబూతులు తిట్టినోళ్లు.. తెలంగాణ అడ్డుకునేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించోనోళ్లు.. తెలంగాణ రాష్ట్రం అవిర్భవించిన తరువాత అదే కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రులుగా కొనసాగుతున్నారని, సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహరెడ్డి వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజునే అదే బాటులో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా తన అక్కస్సును వెళ్లగక్కారు.

తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న క్రమంలో తమకు కనీసం సహకరించకుండా ఏకపక్షంగా సమైక్య రాష్ట్రానికి కట్టుబడి నిర్ణయాలు తీసుకున్న నేతలు.. కేసీఆర్ క్యాబినెట్లో పదవులను అనుభవిస్తున్నారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అవేదన వ్యక్తం చేశారు. తమ అధినేత కేసీఆర్‌ను తిట్టినవారితో పాటు తెలంగాణ‌ ఉద్య‌మంతో సంబంధం లేని వారు తెలంగాణ‌ మంత్రివ‌ర్గంలో కొనసాగుతున్నార‌ని, ఆయన అవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిణమాలను తలుచుకుంటేనే త‌న క‌ళ్ల‌నుంచి నీళ్లు వ‌స్తున్నాయ‌ని తెలంగాణ జేఏసీ మాజీ కార్యదర్శి అన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని అప్పట్లోనే ప‌డ‌గొట్టాల‌ని కొంద‌రు అనుకున్నారని, ఆ స‌మ‌యంలో కేసీఆర్.. రాష్ట్ర కేబినెట్ విషయంలో ఇష్టంలేక‌పోయినా కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చని అన్నారు. కేసీఆర్‌ నిర్ణయం వెనుక బలమైన కారణం ఉండి ఉంటుందని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Nayani Narasimha Reddy  MLAs  mla srinivas goud  parlaiament members  Telangana  

Other Articles