Major Fire Accident At Medchal Industrial Area మేడ్చల్ అగ్నిప్రమాదం: హాహాకారాలతో అట్టుడికిన మేడిపల్లి..

Massive fire accident at medchal industrial area

petrol tanker blast, gas cylinders lorry blast, chengicherla, massive fire accident, medchal, medipally, crime

A biker was killed on the spot after a cooking gas cylinder from a truck went off due to a massive fire caused by a petrol tanker blast on the main road at Chengicherla chowrasta in Medchal district

ITEMVIDEOS: మేడ్చల్ అగ్నిప్రమాదం: హాహాకారాలతో అట్టుడికిన మేడిపల్లి..

Posted: 01/12/2018 07:41 PM IST
Massive fire accident at medchal industrial area

హైదరాబాద్‌ నగర శివారులో పెను ప్రమాదం సంభవించింది. అక్రమార్కుల అత్యాశ ఈ ప్రమాదానికి కారణమైందని తెలుస్తుంది. మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి- చెంగిచర్ల రోడ్డులో ఉన్న వాహన మరమ్మతు కేంద్రంలో శుక్రవారం ఈ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఒకరు మృత్యువాత పడగా.. నలుగురికి గాయాలయ్యాయి.

గ్యాస్ సిలిండర్లు పేలడంతో విస్పోటన శబ్ధం కూడా భారీగా వుండటంతో స్థానికులు ఘటనాస్థలం నుంచి ఉరుకులు పరుగులు తీశారు.  చర్లపల్లి హెచ్‌పీ షోరూం నుంచి వెళ్లే పెట్రోల్‌ టాంకర్ల నుంచి పెట్రోల్‌  చోరీ చేస్తుండ‌గా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మౌలాలి, తార్నాక ప్రాంతాల నుంచి అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేస్తున్నాయి.

ఆయిల్ ట్యాంకర్ నుంచి వ్యాపించిన మంటలు అదే సమయంలో అటుగా వస్తున్న ద్విచక్ర వాహనదారుడికి అంటుకోవడంతో అతను నరకయాతన అనుభవించారు. తలకు హెల్మెట్ తో ఒళ్లంతా గాయాలతో అతడు పడిన యాతన హృదయాలను ద్రవింపజేసింది. అతనికి స్థానికులు ఓ తెల్ల లుంగీని ఒంటిపై కప్పి.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలియగానే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh