home minister fires on telangana mlas and mps ఎమ్మెల్యే, ఎంపీలపై అసభ్యపదజాలం.. మంత్రి నాయిని అగ్రహం

Home minister fires on telangana mlas and mps

KCR, Nayani Narasimha Reddy, Nayani sensational comments, nayini filthy language, MLAs, parlaiament members, Telangana, policitics

Telangana home minister Nayini Narasimha Reddy is one of the few straightforward leaders in Telangana. He doesn't mince words when he wants to say something and calls spade a spade.

చెన్నారెడ్డి మగాడు.. తెలంగాణకు అన్యాయం చేయలేదు

Posted: 01/12/2018 04:08 PM IST
Home minister fires on telangana mlas and mps

1969 తెలంగాణ ఉద్యమంలో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అన్యాయం చేశాడన్న వాఖ్యలను ప్రస్తుత తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ఖండించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చెన్నారెడ్డి నీరుగార్చరన్న కామెంట్లను తోసిపుచ్చిన నాయిని.. ఆయన మగాడని కితాబిచ్చారు. అయితే తెలంగాణను అడ్డుకునేందుకు అనేక శక్తులు 1969 కన్నా పెద్దస్థాయిలో మోహరించినా.. కేసీఆర్ కంకణబద్దుడై తెలంగాణాను సాధించి చూపించారని కొనియాడారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఆయన తీవ్రస్థాయి విరుచుకుపడ్డారు. నాడు కేసీఆర్‌ను బండబూతులు తిట్టి.. అడ్డుకున్న వారే ఇవాళ కళ్లు తెరచి కేసీఆర్ వెంటనడుస్తున్నారని అన్నారు. కేసీఆర్ ను హైదరాబాద్ నుంచి తరిమేస్తామన్న నేతలు.. ఇవాళ ఆయన ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కొనసాగుతున్నారన్నారు. ఇక మరికొందరు నేతలు కేసీఆర్ కేబినెట్‌లో మంత్రులుగా కొనసాగుతున్నారని బూతు పురాణం అందుకున్నారు. కేసీఆర్‌ను తిట్టినోళ్లు నేడు ముఖ్యమైన పదవుల్లో కొనసాగుతున్నారని అన్నారు.

బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం ముద్రించిన 2018 క్యాలెండర్ ఆవిష్కరణకు హాజరైన మంత్రి మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, ఎంపీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీని కూకటివేళ్లతో పెకలించేందుకే ఆ పార్టీ నేతలను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నట్టు స్పష్టం చేశారు. 1969 ఉద్యమకారులను ప్రభుత్వం గౌరవిస్తుందన్న మంత్రి వారందరికీ పింఛన్లు, గుర్తింపు కార్డులు, బస్‌పాస్‌లు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Nayani Narasimha Reddy  MLAs  parlaiament members  Telangana  

Other Articles