ISRO launches its 100th satellite into space విజయవంతంగా అంతరిక్షంలోకి ఇస్రో నూరవ శాటిలైట్

In first mission of 2018 isro launches 100th satellite

Indian Space Research Organisation‬, India‬, Cartosat-2‬, ISRO, Polar Satellite Launch Vehicle‬, sriharikota, ISRO 100th satellite

The 30 other satellites comprise one micro and nano satellite each from India as well as three micro and 25 nano satellites from six countries — Canada, Finland, France, Korea, the United Kingdom and United States of America

విజయవంతంగా అంతరిక్షంలోకి ఇస్రో నూరవ శాటిలైట్..

Posted: 01/12/2018 11:49 AM IST
In first mission of 2018 isro launches 100th satellite

పీఎస్ఎల్వీ-సీ40ని విజయవంతంగా ప్రయోగించి, 31 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలపై ఇటే దేశవ్యాప్తంగా, అటు ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఇస్రో సైంటిస్టులకు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, వైసీపీ అధినేత జగన్ లు అభినందనలు తెలిపారు. ఇక ప్రపంచ దేశాలు కూడా ఇస్రో ఘనతకు అభినందనలు తెలిపాయి.

భారతీయ అంతరిక్ష కేంద్రం ఇస్రో పీఎస్ఎల్వీ-సీ40 ద్వారా ఒకేసారి 31 ఉపగ్రహాలను కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టి మరో నూతన ప్రయోగానికి కూడా సక్సెస్ తో నాంది పలికింది. వీటిలో మూడు స్వదేశీ, 28 విదేశీ నానో శాటిలైట్లు ఉన్నాయి. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ నిర్ణీత వ్యవధిలో నిర్ధేశించి కక్షలోకి వెళ్లాయి. వీటి ప్రయోగానికి క్రితం రోజు ఉదయం 5.29 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ 28 గంటలపాటు కానసాగి.. సరిగ్గా అనుకున్న సమయం 9.29 నిమిషాలకు పీఎస్ఎల్వీని ప్రయోగం విజయవంతమైంది.

మరోవైపు ఇస్రోకి కొత్త ఛైర్మన్ గా రానున్న శివన్ మాట్లాడుతూ, కార్టోశాట్-2 విజయవంతం దేశానికి బహుమతి అని చెప్పారు. ప్రయోగం విజయవంతం కావడానికి కృషి చేసిన ఇస్రో సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇస్రో అంటేనే కొత్త ఆవిష్కరణలకు కేంద్రమని అన్నారు. ఈ ఏడాది మరిన్ని ప్రయోగాలను చేపట్టబోతున్నామని చెప్పారు. చంద్రయాన్-2, జీఎస్ఎల్వీ మార్క్-2 ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు మాట్లాడుతూ, అద్భుతమైన విజయంతో కొత్త ఛైర్మన్ కు స్వాగతం పలికామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cartosat-2  ISRO  ISRO Satellite  PSLV-C40  

Other Articles