విమానయాన రంగంలో కూడా పోటీ అధికమైంది. తమ పోటీదారుల విమాన సంస్థలకు ధీటుగా విమానసంస్థలు సరికొత్త డిసౌంట్ ఆఫర్లును ప్రకటించడం పరిపాటిగా మారింది. దీంతో మధ్యతరగతి ప్రజలు కూడా విమానయానం చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకుని రాయితీలు ప్రకటిస్తూ సీటు అక్యుపెన్నీ పెంచుకుంటున్నాయి. తాజాగా న్యూఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని ఇప్పటికే పలు విమానయాన సంస్థలు డిస్కౌంట్లు ప్రకటించగా, ఎయిర్ ఏషియా కూడా ఇప్పుడదే వరుసలోకి వచ్చింది.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు ఎయిర్ ఏషియా శుభవార్త చెప్పింది. రూ. 1599కే విమానంలో ప్రయాణించే అవకాశాన్ని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా కల్పిస్తోంది. దీంతో పాటు కొన్ని ప్రత్యేక రూట్లకు కూడా రూ. 1600 కంటే తక్కువకే విమాన టికెట్ అందజేస్తోంది. అయితే ఈ ఆఫర్ ఆన్‌లైన్ అడ్వాన్స్ బుకింగ్స్‌కు మాత్రమే. భువనేశ్వర్-కోల్‌కతా, కొచ్చి-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు మధ్య టికెట్ ప్రారంభ ధర రూ.1599గా ఎయిర్ఏషియా వెల్లడించింది.
అలాగే పూణె-బెంగళూరు, భువనేశ్వర్-బెంగళూరు, భువనేశ్వర్-రాంచీ, రాంచీ-కోల్‌కతా, కోల్‌కతా-బగ్డోగ్రా, గోవా-బెంగళూరు, గువహటి-ఇంఫాల్‌ల మధ్య ప్రయాణానికి టికెట్ ప్రారంభ ధర రూ.1899గా ఉంది. రాయితీ ధరలు 2018 మే 6వ తేదీ వరకు ప్రయాణాలకు మాత్రమే వర్తించనున్నాయి. ఈ ఆఫర్ ద్వారా జనవరి 14 వరకు బుకింగ్స్ చేసుకోవచ్చు. కార్డులతో చెల్లింపులకు నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఛార్జీలు ఉంటాయని ఎయిర్ ఏషియా స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Apr 21 | టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తండ్రి నిడమర్తి బసవరాజుకు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. విశాఖపట్నంలోని వేపగుంట ప్రాంతానికి చెందిన బసవరాజు (53) సింహాచలం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో... Read more
Apr 21 | టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం గుట్టు వెనుకనున్న దుష్టచతుష్టయం వీళ్లేనంటూ క్రితం రోజున వరుస ట్విట్లతో బయటపెట్టిన పనవ్..వీళ్లే తన తల్లిని విమర్శించారని ఆరోపిస్తూ, ఫిల్మ్ చాంబర్ కు వచ్చి దీనిపై గట్టి... Read more
Apr 20 | డీజిల్, పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. శుక్రవారం డీజిల్ ధర ఆల్ టైం గరిష్ఠానికి చేరింది. ఢిల్లీలో ఈరోజు లీటర్ డీజిల్ ధర రూ.65.31గా ఉంది. కోల్‌కతాలో రూ.68.01గా, ముంబయిలో రూ.69.54గా, చెన్నైలో... Read more
Apr 20 | తల్లిని విమర్శిస్తూ.. అసభ్యపదజాలంతో తిట్టించిన దుష్టచతుష్టయం ఫోటోలను ఇవాళ ఉదయం వరుస ట్వీట్ల ద్వారా విడుదల చేసిన జనసేనాని, పవర్ స్టార్ పవన్.. ఫిల్మ్ చాంబర్ లో పెద్దలతో చర్చించి తిరిగి వచ్చిన తరువాత... Read more
Apr 20 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ తన తల్లిని తిట్టించిన దుష్టచతుష్టయాన్ని కడుగిపారేస్తూ.. ఇంత నీచంగా, దిగజారి.. తనకు సంబంధం లేని ఓ విషయంలో తనను లాగి తన తల్లిని అసభ్యపదజాలంతో దూషించేందుకు... Read more