U'khand logo on wedding card ఎమ్మెల్యే పెళ్లిపత్రికపై ప్రభుత్వ లోగో.. విమర్శల వెల్లువ

Bjp mla puts u khand government logo on wedding card

Government,BJP,MLA,A Suresh,State Assembly,Uttarakhand,State governments of India,Government of Uttarakhand,Government of India,state government,Suresh Rathore , BJP MLA puts U'khand government logo on wedding card,news, India news

A BJP MLA from Uttarakhand has drawn upon himself much criticism after he used the state government’s logo on a wedding invitation card.

ఎమ్మెల్యే పెళ్లిపత్రికపై ప్రభుత్వ లోగో.. విమర్శల వెల్లువ

Posted: 01/11/2018 10:51 AM IST
Bjp mla puts u khand government logo on wedding card

రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు అధికారంలో వున్నవాళ్లు తలచుకుంటే ఏమైనా జరిగిపోతుంది. ఆ మధ్యకాలంలో రిలయన్స్ జియో లాంఛనంగా ప్రారంభించే క్రమంలో పారిశ్రామిక వేత్త జియోకు ప్రధాని నరేంద్రమోడీని బ్రాండ్ అంబాసిడర్ గా పేర్కొంటూ దినపత్రికలలో ఇచ్చిన ప్రకటనపై ప్రతిపక్షాలు ప్రశ్నల వర్షం కురిపిస్తే.. ఆ భారతీయ కుబేరుడికి కేవలం ఐదువేల రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే.

అనుమతి లేకుండా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను తమ ప్రకటనలలో వాడుకున్నందుకు గాను ఈ జరిమానా విధించారు. ఇక తాజాగా పాలకపక్షానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఏకంగా తన పెళ్లి కార్డులో ప్రభుత్వ లోగానే వేయించుకున్నాడు. తన పెళ్లిని కూడా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేసుకున్నాడు. తన పెళ్లిని వెరైటీగా చేసుకోవాలనుకున్న శాసన సభ్యుడు.. ముఖ్యమంత్రి, మంత్రులు, కూడా తమ ఇంట్లో పెళ్లికి చేయని విధంగా ఏకంగా పెళ్లికార్డులపైనే రాష్ట్ర ప్రభుత్వ లోగోనే ముద్రించేసి అధికారికం చేసుకున్నారు.

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా జ్వాలాపూర్ నియోజవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ రాథోడ్‌కు పెళ్లి కుదిరింది. ఎమ్మెల్యే పెళ్లి అంటే మాటలా.. వివాహ ఆహ్వాన పత్రికను బ్రహ్మాండంగా తయారుచేయించారు. అంతేనా? శుభలేఖ ఎడమవైపున  పైభాగంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వ లోగోను ముద్రించారు. కింద తన పేరు వేయించుకున్నారు. ప్రభుత్వ లోగోను శుభలేఖపై వాడుకోవడంపై రాథోడ్ స్పందించాడు. తాను చేసింది  నేరమేమీ కాదని సమర్థించుకున్నారు.

ప్రభుత్వంలో తాను కూడా భాగమేనని పేర్కొన్న ఆయన, గతంలోనూ ఎంతోమంది ఇలా ప్రభుత్వ లోగోను అచ్చు వేయించుకున్నారని పేర్కొన్నారు. తనను విమర్శిస్తున్న వారు తానో పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని గుర్తెరగాలని హితవు పలికారు. నిజానికి ప్రభుత్వ చిహ్నాలను వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడం నేరం. ఉపయోగించుకోవాలని ముచ్చటపడితే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే ఎమ్మెల్యే మాత్రం ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే ఇలా లోగోను అచ్చేయించడంతో విమర్శల పాలవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Government  BJP MLA  Suresh Rathore  government logo  Uttarakhand  

Other Articles