Switch voice to video calls on WhatsApp వాట్సాఫ్ లో కొత్త ఫీచర్.. స్విచ్

Whatsapp new feature encourages users to switch from voice to video calls

whatsapp, whatsappnewupdate, whatsappnewupdatecomes, switchfeaturefromvoicetovideo, WhatsApp, update, switch, voice calls, video calls, News, Tech, Lifestyle

WhatsApp is bringing a minor but important update to the ubiquitous messaging client. The new beta version 2.18.4 of the chat app brings with it the option to switch between voice and video calls on the fly.

వాట్సాఫ్ లో కొత్త ఫీచర్.. స్విచ్

Posted: 01/11/2018 10:07 AM IST
Whatsapp new feature encourages users to switch from voice to video calls

టెలికాం రంగంలో వచ్చి సాంకేతిక విప్లవాన్ని అందుకున్న స్మార్ట్ ఫోన్లు.. రోజుకో అద్భుతంతో ప్రపంచాన్ని గుప్పిట్లోకి తీసుకొస్తున్న తరుణంలో.. మరో అద్భుత అవిష్కరణకు సామాజిక మాద్యమం వాట్సాప్ శ్రీకారం చుట్టనుంది. కేవలం ఒక్క బ‌ట‌న్ నొక్క‌డం ద్వారా వాయిస్ కాల్ ను వీడియో కాల్ గా మార్చివేయనుంది. త్వరలోనే ఈ అద్భుతాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు వాట్సాప్ పేర్కొనింది. ఇక అబద్దాల రాయుళ్ల అటలు కట్టివేయనుంది.

ఇన్నాళ్లు ఎక్కడో వుండి ఇక్కడే వున్నామని చెప్పే వారి ఆటలు సాగనివ్వకుండా వాట్సాప్  స్విచ్ పేరుతో అందుబాటులోకి తీసుకురాబోతున్న ఈ బ‌ట‌న్ సాయంతో ఒక వైపు వాయిస్ కాల్ మాట్లాడుతూనే, వీడియో కాల్‌కి మారే అవ‌కాశం ల‌భిస్తుంది. ఇందుకోసం ప్ర‌త్యేకంగా వాయిస్ కాల్ క‌ట్ చేసి, మ‌ళ్లీ వీడియోకాల్ చేయ‌న‌వ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ స‌దుపాయాన్ని బీటా వెర్ష‌న్‌కి మాత్ర‌మే ప‌రిమితం చేశారు. త్వ‌ర‌లో రానున్న అప్‌డేట్ ద్వారా ఈ స‌దుపాయాన్ని అంద‌రికీ క‌ల్పించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

స్విచ్ బ‌ట‌న్ నొక్కిన‌ప్ప‌టికీ అవ‌త‌లి వ్య‌క్తి వీడియో కాల్ మాట్లాడ‌టం ఇష్టం లేక‌పోతే... ఆ రిక్వెస్ట్‌ను తిర‌స్క‌రించి వాయిస్ కాల్‌లోనే కొన‌సాగే అవ‌కాశం కూడా ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెడుతున్న వాట్సాప్ ఈ మ‌ధ్య అనుకోకుండా ఓ ఫీచ‌ర్‌ని ఎనేబుల్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ ఫీచ‌ర్ స‌హాయంతో గ్రూప్‌లో ఎవ‌రికైనా వ్య‌క్తిగ‌తంగా రిప్లై ఇచ్చే అవ‌కాశం ఉంది. అయితే ఈ ఫీచ‌ర్‌ని వాట్సాప్ వెంట‌నే తొల‌గించింది. ఇంకా అభివృద్ధి ద‌శ‌లోనే ఉన్న నేప‌థ్యంలో ఈ ఫీచ‌ర్‌ని పూర్తిస్థాయిలో విడుద‌ల చేయ‌లేదు. త్వ‌ర‌లోనే గ్రూప్ ఇండివిడ్యువ‌ల్ రిప్లై ఫీచ‌ర్ కూడా అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : WhatsApp  update  switch  voice calls  video calls  News  Tech  Lifestyle  

Other Articles

 • Women can buy bikes at 50 subsidy under amma scheme in tamil nadu

  సగం ధరకే టూవీలర్.. అయినా ఆదరణ కరువు..

  Jan 23 | సగం ధరకే ద్విచక్రవాహనాలను అందజేస్తామని ప్రకటన ఇచ్చి కౌంటర్లను ఏర్పాటు చేసినా.. తమళనాడులో మహిళలు పెద్దగా అసక్తిని కనబర్చడం లేదు. ఇందులో కూడా ఏదైనా మోసం వుందా..? అందుకనే వారు వెనకంజ వేస్తున్నారా..? అన్న... Read more

 • Actor praful bhalerao falls to death from train in mumbai

  రైలు ప్రమాదంలో విషాదం.. నటుడి దుర్మరణం

  Jan 23 | చిత్రపరిశ్రమలో బాలనటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి.. అటు సినీ, ఇటు బుల్లితెర మరాఠీ ప్రేక్షకులను అలరించిన నటుడు ప్రఫుల్ భలేరావు రైలు ప్రమాదంలో మరణించాడు. అప్పటికే కదిలిన రైలును ఎలాగైనా ఎక్కాలన్న తొందరలో ఇరవై... Read more

 • Shiv sena decides to end ties with bjp says will fight for hindutva

  దశాబ్దాల మైత్రికి బ్రేక్.. ఒంటరిపోరుకు సై అంటున్న శివసేన

  Jan 23 | శివసేస పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో అధికారంలో వున్న నరేంద్రమోడీ ప్రభుత్వంతో తాము కలసి నడవలేమని ఇదే విధానాన్ని తాము రానున్న ఎన్నికలలోనూ అమలు చేస్తామని తేల్చిచెప్పింది. అధికారంలో వున్నా.. లేక విపక్షంలో... Read more

 • Pawan kalyan calls for long time war in karimnagar

  ITEMVIDEOS: సుదీర్ఘపోరాటానికి సిద్దంకండీ: సమన్వయకర్తలకు పవన్ పిలుపు

  Jan 23 | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు వేరైనా అందరం భారతీయులమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దేశం కోసం తన గుండె కొట్టుకుంటుందని అన్నారు. పాలకుల ప్రాంతీయ అసమానతల పాలన వల్ల ప్రాంతీయ విభేదాలు తెరపైకి... Read more

 • Pawan kalyan explains janasena idealogies at karimnagar

  జనసేన సిద్దాంతాలు చెప్పిన పవన్ కల్యాన్

  Jan 23 | జనసేన పార్టీ స్థాపించి.. ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి తొలిసారిగా దిగుతున్న క్రమంలో జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ పార్టీ సిద్దాంతాలను సమన్వయకర్తలకు వివరించారు. కరీంనగర్ లోని శుభం గార్డెన్స్ లో... Read more

Today on Telugu Wishesh