Teen girl killed after gang-rape in Uttar Pradesh మీరట్ లో బాలికపై గ్యాంగ్ రేప్, హత్య..

Teen girl killed after gang rape in meerut accused confess they did it for fun

minor gangrape,Minor raped,minor killed,meerut rape cases,uttar pradesh minor raped,hisar minor raped,delhi minor rape,uttar pradesh rape and murder,Minor sexually assaulted,Minor assaulted,panchkula minor raped,haryana minor,minor rapes in india,UP Police, crime

After sexually assaulting the minor, the trio strangled her and dumped the body in a canal at Greater Noida's Bil Akbarpur village.

యూపీలో దారుణం: సరదాగా బాలికపై గ్యాంగ్ రేప్, హత్య..

Posted: 01/10/2018 07:59 PM IST
Teen girl killed after gang rape in meerut accused confess they did it for fun

బాలికను అపహరించి అతిదారుణంగా సామూహిక అత్యాచారం చేసిన నిందితులు పోలీసుల విచారణలో చెప్పిన సమాధానం వింటే విస్తుపోక తప్పదు. వీరు చెప్పిన సమాధానమేంటో తెలుసా..? అత్యాచారం వార్తలు విని, ఈ ఘటనకు పాల్పడితే ఎలా వుంటుందోనని అభంశుభం తెలియని ఓ బాలికను అపహరించి నిర్ఝన ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే వీరు ఈ దారుణానికి పాల్పడింది కేవలం సరదాగానేనట.

ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ ప్రాంతానికి చెందిన అబ్బాసీ, దిల్షద, ఇజ్రాయెల్‌ అనే ముగ్గురు యువకులు వారం రోజుల క్రితం ఓ బాలికను అపహరించారు. నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి బాలిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటనలో బాధితురాలు కన్నుమూసింది. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని నోయిడాలోని కాలువలో పడేసి పారిపోయారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే యువకులు ప్రయాణించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.

బాలికను ఎందుకు అపహరించారు అని వారిని పోలీసులు విచారించగా..‘రాత్రి మద్యం తాగుతూ ముగ్గురం ఓ సినిమా చూశాం. ఆ తరువాత సరదాగా బాలికను కిడ్నాప్‌ చేయాలనుకున్నాం. రోడ్డుపై వెళుతుంటే ఓ బాలిక ఒంటరిగా కన్పించడంతో ఆమెను కారులో ఎక్కించుకుని తీసుకుపోయాం’ అని చెప్పారు. వారి సమాధానానికి పోలీసులు ఖంగుతిన్నారు. నేరాన్ని ఒప్పుకోవడంతో ముగ్గురు నిందితులపై కేసులు నమోదు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : minor girl  gangrape  meerut  uttar pradesh  sexual assault  UP Police  crime  

Other Articles

Today on Telugu Wishesh