UIDAI introduces virtual ID for Aadhaar ఆధార్ నెంబరుకు బదులు వర్చువల్ ఐడీ.. త్వరలో

Uidai introduces virtual id limited kyc for aadhaar card holders

UIDAI, Aadhaar ID, Privacy problems, UID card, Virtual ID system, Aadhaar card, Aadhaar info, virtual id, aadhaar privacy, aadhaar kyc

Unique Identification Authority of India (UIDAI) today released a 2-layer safety net -- creating a Virtual ID and limiting Know Your Customer (KYC) - for the 12-digit biometric code.

ఇకపై ఆధార్ వివరాలు గోప్యం.. వర్చువల్ ఐడీతో..

Posted: 01/10/2018 06:46 PM IST
Uidai introduces virtual id limited kyc for aadhaar card holders

మీ అధార్ నెంబరు అటు బ్యాంకు అకౌంట్లకు, ఇటు మొబైల్ నెంబర్లకు, దీంతో పాటు ఇన్సూరెన్స్, ప్రభుత్వ పథకాలన్నింటికీ అనుసంధానం చేయడం వల్ల ఎక్కడనుంచైనా, ఎవరి నుంచైనా మీ వ్యక్తిగత వివరాలు లీక్ అవుతాయన్న అందోళన మీకు కలుగుతుందా..? ఇటీవల ట్రిబ్యూన్ పేపర్ లో వచ్చిన కథనం నేపథ్యంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయా..? అయితే ఇకపై మాత్రం మీకు ఇలాంటి దిగులు, అందోళన అవసరం లేదని చెబుతున్నారు ఉడాయ్ అధికారులు.

ఎందుకంటే ఇకపై మీ అధార్ నెంబరుకు బదులు మరో వర్చువల్ ఐడెంటిఫికేషన్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఆధార్ వివ‌రాలు వెల్ల‌డించ‌కుండా అవ‌స‌ర‌మైన చోట‌ల్లా ఆధార్‌ను ఉప‌యోగించుకునే స‌దుపాయాన్ని త్వ‌ర‌లో యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) క‌ల్పించబోతోంది. ఇందుకోసం ఓ తాత్కాలిక వ‌ర్చువ‌ల్ ఐడీని జారీ చేసే విధానాన్ని అభివృద్ధి చేస్తోంది.

ఈ 16 అంకెల తాత్కాలిక వ‌ర్చువ‌ల్ ఐడీ ద్వారా వ్య‌క్తిగ‌త వివ‌రాలు వెల్ల‌డించ‌కుండా ఆధార్ ఆధారిత సేవ‌ల‌ను పొందే అవ‌కాశం క‌లుగుతుంది. మార్చి నెలాఖ‌రులోగా ఈ విధానాన్ని అమ‌లు చేసేందుకు యూఐడీఏఐ ప్ర‌య‌త్నిస్తోంది. ఈ వ‌ర్చువ‌ల్ ఐడీని ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగ‌దారుడు జ‌న‌రేట్ చేసుకోవ‌చ్చు. ఈ ఐడీలో వినియోగ‌దారుడి ఆధార్ వివ‌రాలు ఉంటాయి.

అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత ఈ ఐడీ నిర్వీర్య‌మ‌వుతుంది. ఆధార్ స‌ర్వ‌ర్ హ్యాక్ అయిన కార‌ణంగా దేశంలో ఉన్న అంద‌రి వివ‌రాలు త‌ప్పుడు ప‌నుల‌కు ఉప‌యోగ‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని, ప్ర‌భుత్వం వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ మీద భ‌రోసా ఇవ్వ‌లేక‌పోతోంద‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో యూఐడీఏఐ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virtual id  UIDAI  aadhaar privacy  aadhaar kyc  AADHAAR  

Other Articles