New drug could reduce fat without dieting మధుమేహ, హృద్రోగులకు గుడ్ న్యూస్..

New drug could reduce fat without dieting researchers claim

fat, fat burn, researchers, drug, texas medical branch, galveston, blood colesterol, mice, stanley watowich, chronic diseases, Type-2 diabetes, cardiovascular diseases, placebo, diet, food, health, obesity, drug, weight loss

Happy news for people who have been trying hard to shed those extra kilos, as a team of researchers are developing a drug that can selectively shrink excess fat.

అతిబరువుతో ఆయాసపడుతున్నారా.? మీకో శుభవార్త

Posted: 01/08/2018 10:02 AM IST
New drug could reduce fat without dieting researchers claim

బరువు అధికంగా వున్నామని నిత్యం మనోవేధన చెందేవారికి ఇదోక గుడ్ న్యూస్. గంటల తరబడి చమటను కార్చుతున్నా.. కఠోర వ్యాయామాలు చేస్తున్నా మీ శరీర బరువు తగ్గడం లేదా..? ఇక బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేసి కూడా విఫలమయ్యారా..? దీంతో పాటు మీ నోరును కూడా కట్టేసుకున్నారా..? కళ్ల మంుదు మీకు ఇష్టమైన అహారం కనబడుతున్నా.. దానిని తినకుండా మీ మనస్సును నియంత్రణలో వుంచుకుంటున్నారా..? అయితే ఇక మీకు ఇలాంటి అవస్థలు పడాల్సిన పనిలేదు.  

మీ వంట్లో భారీగా పేరుకున్న కొవ్వును వదిలించుకునేందుకు తోడ్పడే కొత్త ఔషధాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీంతో ఇక మీరు శారీరక శ్రమ అవసరం లేకుండా.. మీ ఆహార నియమాలు పాటించకపోయినా ఇది చక్కటి ఫలితాలను ఇవ్వడం విశేషం. ఈ ఔషదం కొవ్వును అరగదీయంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తుంది. దీంతో మీ బరువు తగ్గడంతో పాటు మీ శరీరంలోని కొవ్వు కూడా గణనీయంగా తగ్గిపోతుంది. ప్రస్తుతం ఈ ఔషదాన్ని ఎలుకలపై వినియోగించి ఫలితాలను రాబట్టారు. ఇక దీనిని త్వరలోనే మరింత అభివృద్ది చేసి అధిక బరువుగలవారికి అందుబాటులోకి తీసుకువస్తారు.

స్థాయిలు పెరిగేకొద్దీ కొవ్వు కణాలు ప్రత్యేక ప్రొటీన్లను విడుదల చేసి.. కొవ్వు కణాల్లోని జీవక్రియా రేటును నెమ్మదింపచేస్తాయి. దీంతో ఊబకాయం, టైప్‌-2 మధుమేహం, హృద్రోగాలు లాంటి వ్యాధులు చుట్టుముడతాయి. ప్రస్తుతం ఈ కొవ్వు కణాల జీవక్రియా రేటుపై అమెరికాలోని టెక్సాస్‌ మెడికల్‌ స్కూల్‌ నిపుణులు దృష్టిసారించారు. దీన్ని క్రియాశీలం చేసే ఔషధాన్ని వారు అభివృద్ధి చేశారు. ఊబకాయ ఎలుకలకు పది రోజులపాటు దీన్ని అందించారు. దీంతో ప్లాసెబో తీసుకున్న ఎలుకలతో పోలిస్తే.. వీటి బరువు సగటున ఏడు శాతం వరకూ తగ్గినట్లు వెలుగులోకివచ్చింది. అంతేకాదు కొవ్వు కణాలూ 30 శాతం వరకూ కరిగినట్లు బయటపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : texas medical branch  galveston  diet  food  health  obesity  drug  weight loss  

Other Articles