aap lady mla alka lamba controversial tweet on modi ట్రిపుల్ తలాక్ పై అప్ ఎమ్మెల్యే వివాదాస్పద ట్విట్

Aap lady mla alka lamba controversial tweet on modi

triple talaq, pm modi, aap mla, alka lamba, controversial tweet, prime minister of india, viral tweet, social media, bjp

AAP MLA Alka Lamba ctitisized PM Modi on Triple Talaq in her tweet stating that " Why say Talaq Talaq Talaq and go to jail, when you can just leave her without saying anything and become the Prime Minister of India". Now this tweet gone viral on social media

ట్రిపుల్ తలాక్ పై అప్ ఎమ్మెల్యే వివాదాస్పద ట్విట్

Posted: 12/30/2017 12:04 PM IST
Aap lady mla alka lamba controversial tweet on modi

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందని బీజేపి పార్టీ చాటిచెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ట్రిఫుల్ తలాక్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టి అమోదించిన నేపథ్యంలో ఇంకా అనేక విమర్శలు మాత్రం తమపై వస్తూనే వున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ మీకు ఓటు వేసి కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన దేశ మహిళల అభ్యున్నతికి, సంక్షేమానికి ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో వున్న మహిళా బిల్లును ఎందుకు అమోదించడం లేదని ప్రశ్నించిన విషయం తెలిసిందే.

ఇలా ఎన్నో అడ్డంకులు, వివాదాల సుడిగుండాలను దాటుకుని 'ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు' లోక్ సభలో అమోదం పోందింది. అయితే దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన ఎంఐఎం.. ఇటీవల పార్లమెంటులో ఆ పార్టీ నేత అసుదుద్దీన్ ఒవైపీ మాట్లాడుతూ.. మైనారిటీలకు చెందని, మరీ ముఖ్యంగా ముస్లింలకు చెందని లక్షాలాధి మంది మహిళలు తమ భర్తలకు దూరంగా దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని వారిలో గుజరాత్ లోని తమ వదిన కూడా వున్నారని, వారి పరిస్థితి ఏమిటీని కూడా ప్రశ్నించిన విషయం తెలిసిందే.

తాజాగా ఆప్ మహిళా ఎమ్మెల్యే ఆల్కా లంబా ట్రిపుల్ తలాక్‌ బిల్లును ఉద్దేశిస్తూ సంచలన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ప్రధాని మోడీ వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆమె వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది.ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ, ట్విట్టర్ ద్వారా పరోక్ష విమర్శలు గుప్పించారు. "తలాక్ చెప్పి ఎందుకు అనవసరంగా జైలుకు వెళ్తారు? మీ భార్యకు తలాక్ చెప్పకుండా కామ్ గా ఉంటే... భారతదేశానికి మీరు ప్రధానమంత్రి అవుతారు" అంటూ కామెంట్ చేశారు. ఈమె వ్యాఖ్యలపై బీజేపీ మద్దతుదారులు మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles