Arun Jaitley puts end to speculations over Rs 2000 notes రూ.2000 నోటుపై కేంద్ర విత్త మంత్రి క్లారిటీ

Arun jaitley dismisses rumours of govt planning to ban rs 2000 notes

Demonetisation, Arun jaitley, PM Modi, Narendra modi, Reserve Bank, State Bank of India, RBI, Note ban, high-value notes, sbi research report, parliament, union government, remonetisation, latest news

Finance Minister Arun Jaitley put an end to all rumors about the RBI holding back Rs 2000, and asked not to believe such things till any official announcement.

రూ.2000 నోటుపై కేంద్ర విత్త మంత్రి క్లారిటీ

Posted: 12/23/2017 12:36 PM IST
Arun jaitley dismisses rumours of govt planning to ban rs 2000 notes

నోట్ల రద్దుతో సాహసోసేత నిర్ణయాలు తీసుకునే కేంద్ర ప్రభుత్వం మరోమారు కూడా అలాంటి నిర్ణయామే తీసుకుంటుదన్న వార్తలు అటు జాతీయ మీడియా నుంచే కాకుండా ఇటు ఎస్టీహెచ్ వార్షిక నివేదికలో కూడా పేర్కొన్న నేపథ్యంలో అనేక రకాల వదంతులు రావడంతో వాటిపై ఎట్టకేలకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు గుజరాత్ పర్యటనలో వున్న కేంద్ర అర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. రూ.2 వేల నోట్లను ముద్రణ నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.

రూ.2వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేస్తున్నట్లు గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా వస్తున్న వదంతలు చెలరేగాయి. ఇక మరికోందరైతే కేంద్రం రూ.2000 నోట్లను కూడా కేంద్రం రద్దు చేయనుందని కూడా వార్తలు వచ్చాయి. దీంతో దేశ ప్రజల్లో తీవ్ర అందోళన వ్యక్తమైంది. ఇప్పటికే బ్లోఇన్ దెబ్బతో బ్యాంకుల నుంచి తమ డిపాజిట్లను తీసుకుని ఇళ్లలో పెట్టుకున్న తరుణంలో.. ఇలాంటి వార్తలు రావడంతో.. వారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న డైలిమాలో కొట్టుమిట్టాడుతున్నారు.

దీంతో రంగంలోకి దిగిన అర్థిక మంత్రి రూ.2000 నోట్లపై కేంద్ర ప్రభుత్వం నుంచైనా లేక భారతీయ రిజర్వు బ్యాంకు నుంచైనా అధికారిక ప్రకటన వచ్చే వరకూ ప్రజలెవరూ వదంతులను నమ్మొదని చెప్పారు. అయితే ఇటీవల ఎస్‌బీఐ చేసిన పరిశోధనలో ఆర్బీఐ దగ్గర రూ.2,46,300 కోట్ల విలువైన నోట్లు ఉన్నట్లు పేర్కొంది. అంతేకాదు ఇకపై ఆర్బీఐ రెండువేల నోట్ల ముద్రణను నిలిపివేయడం లేదా కొద్దిమేర తగ్గించడంగానీ జరగనుందని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles