Rahul Gandhi appointed Congress president ఏఐసిసి అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు

Rahul gandhi takes over as congress president

Rahul Gandhi, Rahul Gandhi Congress president, Indian Nation Congress, Sonia Gandhi, Congress presidential election, Rahul Gandhi appointed Congress president, Manmohan Singh, Narendra Modi, Gujarat elections, UPA, NDA, Himachal Pradesh elections

Rahul Gandhi formally took over as the 49th Congress president today. He was handed over the certificate for taking over as the president which was held by his mother Sonia Gandhi since 1998.

కాంగ్రెస్ శ్రేణుల సంబరాల మధ్య.. అధ్యక్షుడిగా రాహుల్..

Posted: 12/16/2017 12:40 PM IST
Rahul gandhi takes over as congress president

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఇవాళ కాంగ్రెస్ నేతల మధ్య లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. 19 ఏళ్లపాటు సుదీర్ఘంగా కాలంగా పార్టీ బాధ్యతలను మోసిన అధినేత్రి, తల్లి సోనియా గాంధీ నుంచి ఆయన పార్టీ పగ్గాలను అందుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన ఇవాళ ఉదయం లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘచరిత్ర కలిగిన కాంగ్రెస్ లో గాంధీ కుటుంబం నుంచి అధ్యక్ష పగ్గాలను అందుకున్న అరో వ్యక్తిగా రాహుల్ నిలిచారు.

2004 నుంచి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ.. పార్టీ వ్యహరాలను అందుకునేందుకు మొదట యువజన కాంగ్రెస్ పగ్గాలను అధ్యక్షుడి హోదాలో అందుకున్నారు. యూత్ కాంగ్రెస్ లోనూ అంతర్గత ప్రజాస్వామం వుండాలని భావించిన ఆయన ఓటింగ్ ద్వారానే యూత్ కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవాలని కొత్తవిధానానికి తెరలేపారు. ఈ నేపథ్యంలో 2013లో ఆయన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నియ్యారు.

సుమారు నాలుగేళ్ల పాటు పార్టీలో నెంబర్ టుగా కొనసాగుతన్న ఆయన తన భుజస్కందాలపై పార్టీ బరువుబాధ్యతలను మోస్తూనే వున్నారు. ఈ క్రమంలో సుదీర్ఘకాలం అధ్యక్షురాలిగా పని చేసిన సోనియా.. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న క్రమంలో అధ్యక్ష బాధ్యతలను ఇవాళ అయనకు అప్పగించారు. అయితే కేవలం పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, రాజకీయాలకు కాదని కూడా అమె చెప్పారు.

రాహుల్ కాంగ్రెస్ పట్టాభిషేకం సందర్భంగా ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్‌లో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన రాహుల్ గాంధీకి సోనియా అభినందనలు తెలిపారు. రాహుల్ సారథ్యంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆమె సూచించారు. ఇందిరా గాంధీ, రాజీవ్‌ల హత్యలను సోనియా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇందిరా తనను సొంత కూతురిలా చూసుకునేవారని తెలిపారు.

రాహుల్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే ప్రత్యేకమైందని తెలిపారు. 19 ఏళ్ల పాటు పార్టీని ముందుకు నడిపిన సోనియా గాంధీపై మన్మోహన్ ప్రశంసల జల్లు కురిపించారు. కాంగ్రెస్ హయాంలో దేశాన్ని వృద్ధిపథంలో నడిపామన్నారు. ఆ తరువాత అధ్యక్ష పగ్గాలను అందుకున్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశప్రజలకు మంచి చేయాలన్న నమ్మకంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.

ప్రతి ఒక్క భారతీయుడి గొంతుకగా మారేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. దేశ సేవకు అంకితమైన కాంగ్రెస్ కార్యకర్తలకు రక్షణగా నిలవడం తన బాధ్యత అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మన దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువచ్చిందని, ప్రస్తుత ప్రధాని దేశాన్ని తిరోగమనం వైపు నడిపిస్తున్నారని విమర్శించారు. రాజకీయాలు ప్రజాసేవకు ఉపయుక్తంగా లేకుండా ఉన్నాయని, రాజకీయ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల మధ్య బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోందని, ఒకసారి విద్వేషాలు చెలరేగితే అణచివేయడం చాలా కష్టమని రాహుల్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonia Gandhi  Rahul Gandhi  Manmohan Singh  Congress President  Congress  

Other Articles