jana sena party double dhamaka victories ‘‘జనసేన డబుల్ ధమాకా’’

Pawan kalyan s janasena party achives two victories on consecutive days

Jana Sena, Jana Sena leader, Gade Tirupati Rao, civil disputes, litigation, lease agreement, Pawan Kalyan, e subbarao, y.subbarao, defamation case, china kakani, jana sena party office, pawan kalyan, celebrities, ysrcp,Gade Tirupati Rao, chinakakani, party office land, pawan kalyan, venkat reddy, death threat, politics

Jana Sena leader Gade Tirupati Rao spoke to the media persons said that the land was taken from the farmers was free from civil disputes or litigation. He added that some leaders are deliberately trying to thwart the idea of setting up office

రెండు సవాళ్లు.. ‘‘జనసేన డబుల్ ధమాకా’’

Posted: 12/15/2017 03:17 PM IST
Pawan kalyan s janasena party achives two victories on consecutive days

జనసేన పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండానే విజయాలను అందుకుంది. తెలుగు రాష్ట్రాలలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఈ సారి సార్వత్రిక ఎన్నికలతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అరంగ్రేటం చేస్తామని ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కల్యాన్ ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులు అప్పుడే ఆ పార్టీ చేపడుతున్న పనులకు అవరోధాలు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకే రోజు ఎదురైన రెండు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోన్న జనసేన పార్టీ ఏకంగా డబుల్ ధమాకాను అందుకుంది.

ప్రత్యర్థి పార్టీల నేతలో లేక కార్యకర్తలు సృష్టించారో తెలియదు కానీ.. పనికట్టుకుని చేసిన ప్రత్యర్థుల సవాళ్లను జనసేన ధీటుగా ఎదుర్కొంది. ఇప్పటికే జగన్ అభిమానిగా చెప్పుకున్న వెంకట్ రెడ్డిని జనసేన కార్యకర్తల పిర్యాదు మేరకు కటకటాల వెనక్కు నెట్టారు పోలీసులు. తాను స్పష్టంగా జగన్ అన్నను ఏమైనా అంటే చంపడానికి కూడా వెనకాడను అంటూ.. పవన్ ఫ్యాన్ చేతనైతే గుంటూరుకు వచ్చి తనను ఎదుర్కోవాలని కూడా వార్నింగ్ ఇచ్చిన వీడియో వైరల్ కావడం.. పవన్ ఫ్యాన్ పిర్యాదు చేయడం.. పోలీసులు అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి.

ఇక ఇదే సమయంలో జనసేన అంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలో వున్న మంగ‌ళగిరిలోని చిన‌కాకానిలో నిర్మించ తలపెట్టిన పార్టీ కార్యాల‌య భూమికి సంబంధించిన స్థలం కూడా వివాదాస్పదమైందని నిన్న మీడియాకు వెలువరించిన భూమి యజమానుల.. అది వివాదాస్పదమైన భూమని చెప్పారు. దీంతో నిన్న సాయంత్రం సదరు భూమి విషయంలో వివాదాలు వున్న విషయం తమకు తెలియదని, అది వివాదాస్పదమైందే అయితే తాము దానిని వదులుకోడానికి కూడా సిద్దమని జనసేన ప్రకటించింది.

కాగా ఇవాళ మరోమారు ఈ భూమి లీజు విషయంతో పాటు పార్టీ కార్యాలయ నిర్మాణం విషయంలోనూ స్పష్టతను ఇచ్చారు. విజ‌య‌వాడ‌లో జ‌న‌సేన నాయ‌కుడు గ‌ద్దె తిరుప‌తిరావు మాట్లాడుతూ.. ఆ స్థ‌ల వివాదం రాజ‌కీయ కుట్ర అని అన్నారు. జ‌న‌సేన పార్టీ ఆ స్థ‌లాన్ని లీజుకు తీసుకుందని తెలిపారు. ఆన్ లైన్ లో వివ‌రాలు చూసే స్థ‌ల య‌జ‌మానుల‌తో ఒప్పందం చేసుకున్నామ‌ని చెప్పారు. భూ య‌జ‌మానుల‌పై ఎటువంటి కేసులూ లేవని స్ప‌ష్టం చేశారు. వాస్త‌వాలు తెలుసుకోకుండా త‌ప్పుడు ప్ర‌చారాలు చేయ‌డం భావ్యం కాద‌ని అన్నారు. సుబ్బారావు కుమారులు ఆ స్థ‌లాన్ని వార‌స‌త్వంగా పొందార‌ని, ఆరోప‌ణ‌లు చేసిన వారిపై తాము కోర్టులో ప‌రువు న‌ష్టందావా వేస్తామ‌ని జ‌న‌సేన నాయ‌కుడు గ‌ద్దె తిరుప‌తి రావు తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles