collector signature forgery case: journo arrested మరదలికి ఏఎన్ఎం ఉద్యోగం.. విలేకరి అరెస్టు

Collector signature forgery case journo arrested

manchiryala, adilabad, news channel, reporter, scribe, journo, collector, signagture, forgery, santosh, rajamani, dmho, manchiryala police, crime

manchiryala district news channel reporter santosh arrested for forgering collector karnan signature, to get a anm job for his sister in law

మరదలికి ఏఎన్ఎం ఉద్యోగం.. విలేకరి అరెస్టు

Posted: 12/15/2017 10:31 AM IST
Collector signature forgery case journo arrested

అతనోక న్యూస్ ఛానెల్ కు విలేకరిగా వ్యవహరిస్తున్నాడు. ఏకంగా కలెక్టర్ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నాడు. ఎవరైనా, ఎక్కడైనా అక్రమాలకు పాల్పడితే వాటిని రికార్డ్ చేసి.. అక్రమాలు జరుగతున్నాయని ప్రజలకు తన న్యూస్ ఛానెల్ ద్వారా వెలువరించాల్సిన బాధ్యత వున్న ఆయన ఏకంగా తానే అక్రమాలకు పాల్పడితే ఎలా వుంటుందని అనుకున్నాడో ఏమో తెలియదు కాని.. తన మరదలికి ఉద్యోగం కోసం అడ్డదారి తొక్కాడు. అనకున్నదే తడవుగా ప్రణాళికను రచించాడు.  

జిల్లా రిపోర్టరుగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఆయన సంతకం ఎలా వుంటుందన్న విషయం తెలుసుకున్న విలేకరి ఆయన సంతకాన్ని పోర్జరీ చేసిన తన మరదలి పేరున నకిలీ అర్డర్లు సృష్టించాడు. అధికారులు ఆ అర్డర్లు చెల్లవని వాటిని తిరస్కరించారు. అయినా తన తప్పును తెలుసుకుని సైలెంట్ గా వుండాల్సింది పోయి.. ఏకంగా జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి వెళ్లి.. అర్డర్లను ఇచ్చి తన మరదలికి ఉద్యోగం ఇవాలని డిమాండ్ చేయడంతో.. అయన కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని విషయం తెలుసుకుని.. విలేకరి అరెస్టు చేయాలని పోలీసులకు పిర్యాదు చశాడు. దీంతో విలేకరి కాస్తా చిట్టచివరకు చిక్కి కటకటాలపాలయ్యాడు.

మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ న్యూస్ ఛానెల్ విలేకరిగా పని చేస్తున్న సంతోష్, తన మరదలు రాజమణికి ఏఎన్ఎం పోస్టు ఇప్పించాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో రాజమణి పేరుతో కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ పత్రాలు సృష్టించి నెన్నెల ఆరోగ్య కేంద్రంలో సమర్పించాడు. అయితే, అక్కడి అధికారులు తిరస్కరించడంతో, మంచిర్యాల డీఎం అండ్ హెచ్ ఓను కలిసి రాజమణికి పోస్టింగ్ ఇవ్వాలని కోరాడు.

ఆ పత్రాలను చూసిన అధికారికి అనుమానం తలెత్తడంతో వాటిని తీసుకుని నేరుగా కలెక్టరేట్ కు వెళ్లి, కలెక్టర్ కర్ణన్ కు చూపించారు. ఆ సంతకం తనది కాదని కలెక్టర్ తెలిపారు. డీఎం అండ్ హెచ్ ఓ ఫిర్యాదు మేరకు సంతోష్, రాజమణిలపై కేసు నమోదు చేశామని, నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించామని మంచిర్యాల ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manchiryala  adilabad  news channel  reporter  scribe  journo  collector  signagture  forgery  santosh  rajamani  dmho  manchiryala police  crime  

Other Articles