Pawan responded Chinakakani Janasena Party Land Issue | ఆఫీస్ స్థల వివాదం.. పవన్ సానుకూల స్పందన.. కుట్ర అయితే మాత్రం పోరాటమే!

Pawan responded on party office

Jana Sena Party , Pawan Kalyan, Chinakakani, Janasena Office, Jana Sena on Party Land Issue, Jana Sena Party Land Litigation

Controversy on JanaSena Party Office Land in Chinakakani, Pawan Kalyan's Janasena Reacted in Twitter in a Statement.

పార్టీ కార్యాలయ వివాదం.. స్పందించిన జనసేన

Posted: 12/14/2017 07:09 PM IST
Pawan responded on party office

పార్టీ కార్యాలయంపై నెలకొన్న వివాదం నేపథ్యంలో జనసేన పార్టీ స్పందించింది. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేరిట ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. అంజుమన్ ఇస్లామిక్ కమిటీ సభ్యులు చేసిన ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని,  వివాదం నిజమైతే లీజ్ వెంటనే రద్దు చేసుకుంటామని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

‘‘మూడు ఎకరాల స్థలాన్ని మూడున్నరేళ్లకు లీజుకు తీసుకున్నామని.. ఈ తీసుకున్న విషయాన్ని పత్రికా పూర్వకంగా కూడా ప్రకటన ఇచ్చామని.. అప్పుడే తన దృష్టికి తీసుకువచ్చి ఉంటే బాగుండేదని’’ పవన్ అన్నారు. కానీ, ఇప్పుడు, ఓ రాజకీయవేత్త సమక్షంలో మీడియా ముందుకు రావడం అనుమానించాల్సి వస్తోందని అన్నారు. ఇది రాజకీయ కుట్ర అయితే కనుక, పోరాడే బలం ‘జనసేన’కు ఉందని పవన్ పేర్కొన్నారు.

త్వరలోనే న్యాయ నిపుణులతో కలసి జనసేన ప్రతినిధులు చినకాకాని వస్తారని, సంబంధిత డాక్యుమెంట్లను వారికి ముస్లిం పెద్దలు ఇవ్వాలని కోరారు. ఆ స్థలం వారిదని నిర్ధారణ అయిన మరుక్షణమే జనసేన పార్టీ ఆ స్థలానికి దూరంగా ఉంటుందని ఆ ప్రకటనలో పవన్ హామీ ఇచ్చారు.

కాగా, ఏపీ రాజధాని సమీపంలో పార్టీ కార్యాలయం నిర్మాణం నిమిత్తం మంగళగిరిలోని చినకాకానిలో మూడు ఎకరాల స్థలాన్ని జనసేన పార్టీ లీజ్ కు తీసుకున్న విషయం తెలిసిందే. మూడు ఎకరాల స్థలాన్ని యార్లగడ్డ సాంబశివరావు తో జనసేన ఒప్పందం చేసుకుంది. అయితే, ఈ స్థలం తమదని, ఇది వివాదంలో ఉందని షేఫ్ షఫీ అనే వ్యక్తి మీడియా ముందుకు రావటంతో అసలు వివాదం మొదలైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles