YCP activist arrested for threatening to kill pawan kalyan పవన్ కల్యాన్ సహ ఫ్యాన్స్ కు వార్నింగ్.. వైసీపీ నేత అరెస్టు

Ycp activist arrested for threatening to kill pawan kalyan

YS Jagan mohan reddy, ys jagan, ys jagan fan, Tiyagura Venkat Reddy, Venkat Reddy, Pawan Kalyan, Janasena, venkat reddy warning, venkat reddy jana sena, jana sena venkat reddy, venkat reddy threatens pawan kalyan, venkat reddy threatens janasena fans, venkat reddy arrest, venkat reddy remarks

Tiyagura Venkat Reddy, an accused in 'two murder cases, and a fan of YSRCP President YS Jagan has been arrested for threatening to kill Jana Sena chief Pawan Kalyan for his alleged remarks against Jagan.

పవన్ కల్యాన్ సహ ఫ్యాన్స్ కు వార్నింగ్.. వైసీపీ నేత అరెస్టు

Posted: 12/14/2017 05:30 PM IST
Ycp activist arrested for threatening to kill pawan kalyan

ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంటుంది. ప్రత్యర్థి పార్టీలపై బెదిరింపులు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి. ఓ వైపు విపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రతో రాష్ట్రంలో వెడిని రగుల్చుతున్న క్రమంలోనే మరోవైపు జనసేన అధినేత పవన్ పర్యటను చేస్తున్నారు. ఈ క్రమంలో తమ పార్టీ అధినేతను విమర్శిస్తే చంపేస్తానంటూ వైసీపీకి చెందిన ఓ నేత ఏకంగా జనసేన పార్టీ అధినేతతో పాటు అభిమానులకు, కార్యకర్తలకు హెచ్చరికలు జారీ చేయడం రాష్ట్రంలో కలకలం రేకెత్తిస్తోంది.

ఇది కాస్తా వైరల్ కావడం.. పవన్ కల్యాన్ అభిమానులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లడంతో.. వెంటనే స్పందించిన పోలీసులు తియగుర వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. కాగా, వెంకటర్ రెడ్డి రెండు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని కూడా పోలీసులు తెలిపారు. పవన్ ను హెచ్చరిస్తూ తీసిన సెల్ఫీ వీడియోను అతను ఫేస్ బుక్ లో పెట్టాడు. అదికాస్తా తీవ్ర దుమారం రేపడంతో గుంటూరు శివార్లలోని నల్లపాడు పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి, అతనిని అదుపులోకి తీసుకున్నారు.

జగనన్నను ఏమైనా అంటే చంపడానికైనా, చావడానికైనా సిద్ధమేనని వీడియోలో వెంకటరెడ్డి హెచ్చరించాడు. బబర్దస్త్ హైపర్ ఆదితో జగన్ సమానమని... ప్రజలకు జగన్ దేవుడితో సమానమని, ఆయన ఫొటోలను ఇంట్లో పెట్టుకుంటారని చెప్పాడు. తనది గుంటూరని, చేతనైతే పవన్ సైన్యం వచ్చి తనను ఎదుర్కోవాలంటూ సవాల్ విసిరాడు. మరోవైపు, అతను ప్రస్తుతం హీరో నితిన్ రెడ్డి, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఫ్యాన్స్ ఆలిండియా అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా కోనసాగుతున్నాడని సమాచారం.

గత ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికలలో కూడా వైసీపీకి అధికారాన్ని దూరం చేసేందుకు పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాడని, ఎన్నికల బరిలో నిలుస్తున్నాడని అతను వీడియోలో పేర్కోన్న వ్యాఖ్యలు.. పాదయాత్రలో భాగంగా జగన్ చేసిన వ్యాఖ్యల మాదిరిగానే వున్నాయి. గత ఎన్నికలలో పవన్ ప్రచారం వల్లే గెలుపు వాకిట తమ పార్టీ బోర్లా పడాల్సి వచ్చిందని జగన్ పార్టీ నేతలు, కార్యకర్తలు విశ్వసిస్తున్నారు. కేవలం ఐదు లక్షల ఓట్లు అధికారాన్ని దూరం చేశాయని ఇప్పటికే ప్రతిపక్ష నేత జగన్ పలుసందర్భాలలో తన అవేదనను వ్యక్తం చేసిన నేపథ్యంలో అదే భాగను వెంకట్ రెడ్డి కూడా వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan Fan  Venkat Reddy  Pawan Kalyan  Janasena  threat  arrest  guntur  crime  

Other Articles