hyderabad police alerts vehicle owners బీ అలర్ట్: పెట్రోల్ బంకు వద్ద ఇలా చేశారో..

Hyderabad police alerts vehicle owners via social media

hyderabad police alerts vehicle owners, police alerts vehicle owners, police awareness vehicle owners, hyderabad police, alertness, vehicle owners, social media, awareness, Mobile phone, Petrol Pump

hyderabad police alerts vehicle owners via social media on bringing awareness in public by saying "Don't Use Mobile phone at Petrol Pump".

ITEMVIDEOS: బీ అలర్ట్: పెట్రోల్ బంకు వద్ద ఇలా చేశారో..

Posted: 12/14/2017 03:48 PM IST
Hyderabad police alerts vehicle owners via social media

వాహనదారులను ఎప్పటిఅప్పుడు అలర్ట్ చేసి,.. అవగాహన కల్పించడంలో హైదరాబాద్ పోలీసులు ఓ అడుగు ముందేవున్నారన్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఓ ఘటన నేపథ్యంలో మరోమారు సోషల్ మీడియా వేదికగా నగర వాహనదారులను అప్రమత్తం చేసి.. అవగాహన కల్పించే చర్యలకు పూనుకున్నారు. అదేంటి అంటారా.? పెట్రోల్ బంక్ వ‌ద్ద మొబైల్ ఫోన్ ఉప‌యోగించకూడ‌ద‌ని అటు పెట్రోల్ బంకు యాజమాన్యాలు.. ఇటు పోలీసులు ఎంత‌గా చెప్పినా లక్ష్యపెట్టిన పాపానపోరు కొందరు వాహనదారులు.

ఇప్పటికే పెట్రోల్ బంకు వద్ద మొబైల్ ఫోన్ మాట్లాడితే ఏం జరుగుతుందన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పోలీసులు.. తాజాగా హైదరాబాద్ లోని ఓ పెట్రోల్ బంకులో చోటుచేసుకున్న మరో ఘటనకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు పోలీసులు. నిబంధనలు తమకు వర్తించవు అంటూ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించే పలువురు ఇప్పటికైనా అప్రమత్తం కావాల్సి వుంది. లేదా నెక్స్ట్ మీరే కావచ్చు.

ఇక హైదరాబాద్ పోలీసులు ట్వట్టర్ వేదికగా పోస్టు చేసిన వీడియోలో ఏముంది అంటారా..? ఓ ద్విచ‌క్ర‌వాహ‌నదారుడు త‌న కుమారుడితో క‌లిసి పెట్రోల్ బంకుకి వ‌చ్చి తన వాహనంలో పెట్రోల్ పోయించుకుంటున్నాడు. ఈ స‌మ‌యంలో సెల్ ఫోన్ ఉప‌యోగించ‌డంతో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగి బైకుకి అంటుకున్నాయి. ఆ బైకుపై కూర్చున్న చిన్నారి కాలికి కూడా మంట‌లు అంటుకున్నాయి. వెంటనే పెట్రోల్ బంకులో వున్నవారంతా ఉరుకులు పరుగులు తీశారు. అలా పరుగు తీస్తున్న ఓ ముస్లిం మహిళ.. కొంత దూరం వెళ్లి అగి ధైర్యంగా తన చేతిలోని బ్యాగుతో మంటలను అర్పే ప్రయత్నం చేసింది.

ఇక ఫైర్ ఎస్టింగ్విషర్ ను తీసుకురావాల్సిన బంకు సిబ్బంది.. పరుగు పెట్టి పెట్రల్ బంకు పక్కకు వచ్చి నిలబడ్డాడు. అయితే, ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో పోలీసులు తెల‌ప‌లేదు. పెట్రోల్ బంక్ వ‌ద్ద‌ వాహనదారులు అనునిత్యం అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచించారు. సెల్ ఫోన్ టవర్ నుంచి వచ్చే తరంగాలు ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ హైఎనర్జీని మోసుకొస్తాయి. చిన్న రాపిడికి కూడా స్పందించగల పెట్రోల్ ను సెల్ ఫోన్ ద్వారా వెలువడే ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ ప్రభావితం చేయగలదు. దీనివ‌ల్ల మంటలు చెల‌రేగే ప్ర‌మాదం ఉందని అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు పోలీసులు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad police  alertness  vehicle owners  social media  awareness  Mobile phone  Petrol Pump  

Other Articles