Sex racket queen kills husband సెక్స్ రాకెట్ క్వీన్ గుట్టురట్టు.. భర్తను కూడా..

Sex racket queen kills husband keeps his body for 13 years in her septic tank

Sex racket queen, Kills husband, kill husband in sleep, sex racket, Mumbai Crime, Mumbai news, Inspector Kiran Kabadi, Farida Bharti, prostitution, sex racket, Gandhipada, Boisar police, mumbai, crime

Cops uncover the skeleton of kingpin’s husband in the septic tank 13 years after she killed and buried him there

సెక్స్ రాకెట్ క్వీన్ గుట్టురట్టు.. భర్తను కూడా..

Posted: 12/07/2017 07:03 PM IST
Sex racket queen kills husband keeps his body for 13 years in her septic tank

తన సుఖాలకు భార్య అడ్డంగా వుందని భావించిన భర్తలు వారి అనందం కోసం ఎంతటి దారుణాలకైనా పాల్పడుతున్న ఘటనలు అనేకం మన చుట్టూవున్న సమాజాంలో నమోదవుతూనే వున్నాయి. అయితే ఇందుకు భిన్నంగా తన సరదాలకు, సంతోషాలకు అడ్డుంగా వున్న భర్తను అంతమొందించిన భార్యల గురించి మాత్రం వినలేదు. అచ్చం ఇలాంటి దారుణానికే పాల్పడిన ఓ భార్య తన భర్తను హతమార్చింది. అతని శవాన్ని తమ ఇంటిలోని సెప్టెక్ ట్యాంకులో పూడ్చిపెట్టింది. అయితే ఈ ఘటన జరిగి ఏకంగా 13 ఏళ్లుకాగా, అలస్యంగా వెలుగు చూసింది.  

ముంబైలోని గాంధీపడ ప్రాంతంలో సెక్స్ రాకెట్ క్వీన్ గా పేరొందిన ఫరీదా భారతి అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమె తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుందన్న విశ్వసనీయ వర్గాల సమాచారంతో కదిలిన పోలీసులు అమె ఇంట్లోంచి నలుగురు యువతులకు విముక్తి కల్పించారు. అమెతో పాటు మరో విటుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు వ్యభిచారం కేసులో ఫరీధా భారతి అరెస్టైందని కూడా పోలీసులు తెలిపారు. అయితే అనేకమార్లు ఈమెపై పిర్యాదులు వచ్చినా.. అమె తప్పించుకోగలిగిందని, అయితే పక్క సమాచారంతో ఈ సారి రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.

అయితే, అమె అరెస్టు తరువాత పోలీసులకు మళ్లీ ఫోన వచ్చింది. అమె ఒక్కతే కాదని అమె వెనుక పెద్ద సెక్స్ రాకెట్ వుందని, అమె తన ఇంట్లోనే ఎంతోమందిని హతమార్చిందని కూడా పోన్ ద్వారా అగంతకులు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో రెండోసారి ఆ ఇంటికి వెళ్లిన పోలీసులు.. కట్టుకున్న భర్తనే కడతేర్చి సెప్టిక్‌ ట్యాంకులో పడేసిన ఆ మహిళ కర్కశత్వానికి బోయిసర్‌ పోలీసులు ఖంగుతిన్నారు. తన సంతోషాలకు, సరదాలకు అడ్డుగా నిలుస్తు.. కష్టపడి బతకాలని సూక్తులు చెబుతున్న భర్త సహదేవ్ ను అతను నిద్రిస్తుండగా చంపేశానని పోలీసుల ఎదుట ఈ సెక్స్ రాకెట్ క్వీన్ అంగీకరించింది.

అంతేకాకుండా తన ఇంట్లోని బాత్ రూమ్ కింద సెప్టిక్ ట్యాంకులో అతడిని పూడ్చిపెట్టినట్టు చెప్పింది. దీంతో ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకొని బుధవారం ఆ ఇంట్లో సోదాలు నిర్వహించగా.. సెప్టెక్ ట్యాంకులో పుర్రె, అస్థిపంజరం బయటపడ్డాయని పోలీసులు తెలిపారు. నిద్రలో ఉండగా సహదేవ్ తలపై బలంగా రోకలితో మోదీ చంపినట్టు ఫరీదా పోలీసు విచారణలో వెల్లడించింది. అ తరువాత వ్యభిచారం నిర్వహిస్తూ.. వచ్చిన డబ్బుతో జల్సాగా.. తన సంతోషాలను, సరదాలను తీర్చుకుంది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Farida Bharti  prostitution  sex racket  Gandhipada  Boisar police  mumbai  crime  

Other Articles