Pawan Strong Punch to YS Jagan with CM Comments | మాట్లాడితే సీఎం అయ్యాక అనటం సరికాదు.. జగన్ కు పవన్ చురకలు

Pawan strong punch to ys jagan

Pawan Kalyan, Janasena Party, YS Jagan Mohan Reddy, CM Comments, Pawan Janasena, Pawan Satires Jagan

Janasena Chief Pawan Kalyan Strong Punches to Opposition Leader YS Jagan Mohan Reddy at Rajahmundry Meet.

ITEMVIDEOS: పవన్ సీఎం కామెంట్లు.. జగన్ కు సెటైర్లు

Posted: 12/07/2017 03:01 PM IST
Pawan strong punch to ys jagan

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయ ఎంట్రీలో ఏ పక్షాలను విడిచిపెట్టడం లేదు. నిన్న వైజాగ్ సభలో అధికార పక్ష నేతలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసిన ఆయన.. నేడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తాను సీఎం అయ్యాక సమస్యలన్నీ పరిష్కరిస్తానంటూ ప్రజాసంకల్పయాత్రలో హామీలు గుప్పించుకుంటూ వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ అంశాన్ని పరోక్షంగా లేవనెత్తిన పవన్ జగన్ కు చురకలు అంటించారు.

రాజ‌కీయం అంటే కేవలం సీఎం కావ‌డం మాత్రమే కాదని, సామాజిక మార్పు చేయ‌డ‌మేనని పవన్ అన్నారు. 'సీఎం అవుతాను.. అప్ప‌టివ‌ర‌కు ఆగండి ప‌నులు చేస్తానంటే కుద‌ర‌ద'ని.. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా ప్ర‌భుత్వంతో ఎన్నో ప‌నులు చేయించ‌వ‌చ్చని హిత‌వు ప‌లికారు. తాను కేవలం ప్రభుత్వ అనుకూల వాదినన్న విమర్శలను తిప్పికొట్టిన ఆయన కులం ఆపాదించి ఇకపై ఎవరైనా కామెంట్లు చేస్తే బాగోదని గట్టిగా హెచ్చరించారు. కాగా, ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ లాంటి కమిట్‌మెంట్ లేని వ్య‌క్తులు జ‌న‌సేన‌లో ఉండ‌కూడ‌దని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ అన్నారు.

సైద్ధాంతిక బ‌లంతో తాను జ‌న‌సేన పార్టీ పెట్టాన‌ని, గ‌తంలో బాగా ఆలోచించే బీజేపీ, టీడీపీకి మ‌ద్ద‌తు తెలిపాన‌ని అన్నారు. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి వంద‌ల కోట్లు ఇచ్చేవారు లేర‌ని, ఒక వేళ ఇచ్చినా తాను అటువంటి వారిని పార్టీలోకి తీసుకోన‌ని చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార‌, ప్ర‌తిప‌క్షాలు ఒక‌రికొర‌రు అవినీతిపై పుస్త‌కాలు వేసుకున్నార‌ని అన్నారు. రాష్ట్ర ప‌రిస్థితులు ఇలా ఉంటే పెట్టుబ‌డులు ఎలా పెడ‌తామ‌ని త‌న‌ను లండ‌న్‌లో కొంద‌రు అడిగార‌ని చెప్పారు. డ‌బ్బు లేక‌పోయినా రాజ‌కీయాలు చేయ‌వ‌చ్చ‌ని తాను నిరూపిస్తాన‌ని పవన్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Actor sivaji explodes sensational news on bjp

  ITEMVIDEOS: బీజేపిపై నటుడు శివాజీ సంచలన అరోపణలు..

  Mar 22 | సినీహీరో శివాజీ బీజేపి పేరు ఎత్తకుండా ఆ పార్టీపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా తామే అధికారంలో వుండేలా ఎక్కడికక్కడ అపరేషన్ చేపడుతున్నారని, ఇందుకు వేల కోట్ల రూపాయలను కూడా ఖర్చపెడుతున్నారని అరోపించారు.... Read more

 • Lok sabha adjourned for 5th day without discussion on no trust motion

  డైలీ సీరియల్ ను తలపిస్తున్న అవిశ్వాస ఎపిసోడ్

  Mar 22 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంతో పాటు విభజన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై అధికార టీడీపీ, విపక్ష టీడీపీ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాణం డైలీసీరియల్ ఎపిసోడ్... Read more

 • Giant billboard shows porn in makati city centre

  ఔవ్వ.! బిల్ బోర్డుపై అరనిమిషం పాటు.. బూతు వీడియో..

  Mar 22 | దేశరాజధానిగా బాసిల్లుతున్న నగరం.. నిత్యం రద్దీగా వుండే ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. రోడ్డుపై వెళ్లే ప్రయాణికులకు సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన పెద్దని బిల్ బోర్డులలో ప్రసారమైన అసభ్యకర, అశ్లీల దృశ్యాలే ఇందుకు... Read more

 • Cabinet clears ayushman bharat national health protection mission

  ‘‘ఆయుష్మాన్ భారత్’’ తొలి అడుగేసిన మోడీ సర్కార్..!

  Mar 22 | పేద ప్రజలకు ఉచిత ఆరోగ్యబీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించిన నరేంద్రమోడీ ప్రభుత్వం అదిశగా తొలి అడుగు వేసింది. పేద ప్రజలకు అందించే ఉచిత అరోగ్య బీమా పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు... Read more

 • Banks not accepting exchange of torn or soiled currency notes

  సామాన్యుడికి కరెన్సీ కష్టం.. కొంచెం చిరిగినా జేబుకు చిల్లు.!

  Mar 22 | దేశంలో అవినీతి, అక్రమాలు, నల్లధనం, ఉగ్రవాద, మావోయిజాన్ని అణిచివేయాలంటే పెద్దనోట్ల రద్దు లాంటి సాహసోపేత నిర్ణయం తప్పనిసరి అని ప్రకటించిన వెంటనే దానిని 2016 నవంబర్ 8 నుంచి అమల్లోకి తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం..... Read more

Today on Telugu Wishesh