pawan kalyan visits polavaram project పోలవరం ప్రాజెక్టును సందర్శించిన పవన్ కల్యాన్..

Pawan kalyan slams ap govt for misusing polavaram project funds

Jana Sena, Pawan Kalyan, chalore chalore chal, polavaram project, telugu states tour, political tour,condolence, krishna ferry turndown, victim families, telangana, msc physics student, murali, Andhra Pradesh, Hyderabad, telugu cinema, Tollywood

JanaSena chief, power star Pawan Kalyan visits polavaram project, and asks the concerned engineers about the details and reason for stoping the project.

ITEMVIDEOS: పోలవరం ప్రాజెక్టులో అవకతవకలు: పవన్ కల్యాన్..

Posted: 12/07/2017 11:17 AM IST
Pawan kalyan slams ap govt for misusing polavaram project funds

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చాలా అవకతవకలు వున్నాయని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ అరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న క్రమంలో డబ్బులు ఖర్చైన వాటికి కాంట్రాక్టర్లు పద్దులు చెప్పాలని ఆయన అన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించేందుకు ముందు మన చేతిలో బంగారం మంచిదవ్వాలని పవన్ అభిప్రాయపడ్డారు. పోలవరం విషయంలో ఖర్చైన డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేయకపోతే పోలవరం ప్రాజెక్టు విషయం నిధుల ఖర్చును ఎందుకు చెప్పదని పవన్ ప్రశ్నించారు.

శ్వేతపత్రం విడుదల చేసిన తరువాత కూడా కేంద్ర స్పందించకపోతే అప్పుడు తాను రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పోరాడేందుకు సిద్దమని చెప్పారు. అయితే ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలు జరగడం సాధరణ విషయంగానే ఆయన చెప్పుకోచ్చారు. ఎవరో ఒకరు బాద్యత తీసుకోవాలని లేకపోతే తప్పులు జరుగుతాయని అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టును ఎన్నికల కోసం ఏ రాజకీయా పార్టీ వాడుకోవడం సముచితం కాదని తెలిపారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పెద్ద ప్రాజెక్టులు నిర్మించడం కష్టంగా, ఛాలెంజింగ్ గా వుంటుందని తెలిపారు.  

చలోరే చలోరే చల్ పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. రాజమహేంద్రవరం నుంచి కారులో పోలవరం చేరుకున్న పవన్ కల్యాన్ కు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం హిల్ వ్యూ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు సాగుతున్న తీరును ఎస్ఈ వి.రమేష్ బాబు ఆయనకు వివరించారు. స్పిల్ వే, డయా ఫ్రంవాల్ నిర్మాణం, ఎర్త్‌ కమ్ రాక్ ఫిల్‌ డ్యాం, నిర్మాణాల్లో జరుగుతున్న పనులను ఇంజినీర్లు జనసేనానికి వివరించారు.

అయితే మధ్యలో నిలిపేయడం వల్ల ఏ ఒక్క ప్రభుత్వానికో, పార్టీకో కాదు..  ఒక రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందన్న విషయం కేంద్రంలో వున్న ప్రభుత్వం తెలుసుకోవాలని అన్నారు. కానీ తాను పోలవరం అంశంలో కేంద్రాన్ని ప్రశ్నించలేనని, అందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వ పారదర్శకంగా లేకపోవడమేనని అన్నారు. అయితే గత మూడేళ్లుగా ఇప్పటి వరకు రాష్ట్ర రాజధానితో సెక్రటేరియట్ నే పూర్తిస్థాయిలో నిర్మించలేని అంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టును నిర్మించి తీరుతామని చెబుతున్న మాట పూర్తిగా అవాస్తవమని అన్నారు. పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులను అంగీకరించి.. దానిని ఎలా సరిచేసుకుంటామోనన్న విషయాన్ని కేంద్రానికి తెలియజేయాలని పవన్ తేల్చిచెప్పారు.

 ఇక ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలకు కానీ లేక ఎన్నికల సమీపిస్తున్న కొద్ది దీనిని రాజకీయాంశంగా మార్చేందుకు మాత్రం అవకాశం లేదని, అలా చేసినా ప్రజలు నమ్మరని పవన్ అన్నారు. ఇక పోలవరం పునరావాస కేంద్రాలకు వెళ్లాలని వుంది కానీ, అక్కడికి తాను వెళ్లి ఇబ్బందులు పెట్టడం కంటే తన పార్టీ తరపున ఒక జట్టును పంపిస్తానని జనసేనాని తెలిపారు. పవన్‌ పోలవరం నేపథ్యంలోనూ ఆయన అభిమానుల తీరు మాత్రం మారలేదు. ప్రాజెక్టు వద్దకు ఆయన చేరుకున్నప్పట్నుంచీ అభిమానులు.. ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేయడంతో పవన్ కల్యాన్ కొంత అసహనానికి లోనయ్యారు. ఇక్కడకు పనిమీద వచ్చానని, అలాంటి నినాదాలు చేయొద్దని వారించారు. అయినా అభిమానులు నినాదాలు చేస్తూనే ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jana Sena  Pawan Kalyan  chalore chalore chal  polavaram project  politics  

Other Articles

Today on Telugu Wishesh