pawan kalyan reveals the reason of opposing YSRCP జగన్ అంటే గౌరవమే.. కానీ అందుకనే వ్యతిరేకించా

Pawan kalyan reveals the reason of opposing ysrcp

Jana Sena, Pawan Kalyan, YSRCP, YS Jagan, YS Rajashekar Reddy, TDP Hatao, BJP Hatao, CM Pawan Kalyan, telugu states tour, political tour, venkatesh, chalore chalore chal, condolence, Andhra Pradesh, politics

Jana Sena chief Pawan Kalyan says he has respect to YS Jagan and his party but he opposed the immidiate steps he took to become the chief minister of United andhra pradesh.

ITEMVIDEOS: జగన్ అంటే గౌరవమే.. కానీ అందుకనే వ్యతిరేకించా

Posted: 12/06/2017 05:57 PM IST
Pawan kalyan reveals the reason of opposing ysrcp

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో తనకు ఎలాంటి వైరం లేదని జనసేన అధినేత పనవర్ స్టార్ పవన్ కల్యాన్ స్పష్టం చేశారు. చలోరే చలరే చల్ పర్యటన కార్యక్రమంలో భాగంగా విశాఖలో ఏర్పాటు చేసిన జనసేన సమన్వయకర్తల సమావేశంలో పాల్గొన్న పవన్ తన లభిప్రాయాలను పార్టీ శ్రేణులతో పంచుకున్నారు. ఈ సందర్బంగా ఆయన తనకు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ వైసీకి మధ్య వైరం వుందన్న వార్తలను ఖండించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రడ్డి చేసిన పలు ప్రజాహిత కార్యక్రమాలు అద్భుతమని కొనియాడారు.

రాజశేఖర్ రెడ్డి ప్రజాహిత కార్యక్రమాలతో రాష్ట్రంలో అనేక మంది ప్రజలు లబ్ధి చేకూర్చాయని అన్నారు. అయితే అదే రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతిని కూడా ఆయన ప్రస్తావించారు. రాజకీయాల్లో పరిపూర్ణమైన మంచిని ఆశించలేము. రాజకీయాల్లో కొంతమంది వేలకోట్ల డబ్బును వెనకేసుకున్నారు. ప్రజలు మాత్రం తమ ఇబ్బందులను ఎదుర్కొంటనే వున్నారు. మధా రాజా తథా ప్రజా అన్నట్లు రాజు ఎలా వుంటే ప్రజలు కూడా అదే బాటలో నడుస్తారని అభిప్రాయపడ్డారు.

తన తండ్రి మరణానంతరం తాను ముఖ్యమంత్రి కావాలని అప్పటికప్పుడు పథకాలు రచించిన జగన్ నిర్ణయం అవివేకమని అన్నారు. రాజకీయ నేతల వారుసులు తమ ప్రతిభను చాటుకున్న తరువాతే రాజకీయాల్లోకి ప్రవేశించాలని చెప్పారు. ఈ విషయంలోనే తాను జగన్ పార్టీని వ్యతిరేకిస్తాను తప్ప.. మరేవిధమైన వైరం మాత్రం లేదని చెప్పారు. జగన్‌ అంటే నాకు వ్యక్తిగతంగా ఏ మాత్రం వ్యతిరేకత లేదని వెల్లడించారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమా..? లేదా..? అన్న విషయంలో మాత్రం పవన్ స్పష్టతను ఇవ్వలేదు. ఇక ప్రతిపక్ష పార్టీగా గత మూడేళ్లుగా జగన్ తన ప్రతిభను చాటుకున్నారా..? అన్న అంశంపై కూడా పవన్ క్లారిటీ ఇవ్వలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jana Sena  Pawan Kalyan  YSRCP  YS Jagan  YS Rajashekar Reddy  vishakapatnam  chalore chalore chal  politics  

Other Articles