pawan kalyan meets dci employees at vishaka సమస్యలను పరిష్కరించకపోతే ఓట్లు అడిగే హక్కు లేదు..

Pawan kalyan meets dci employees slams mps to solve issue

Jana Sena, Pawan Kalyan, dredging corporation of india, dredging corporation employees, dci employees protest, dci employees agitation, telugu states tour, political tour, venkatesh, chalore chalore chal, condolence, krishna ferru turndown victims, telangana, msc physics student, murali, Andhra Pradesh, Hyderabad, telugu cinema, Tollywood

Jana Sena chief, power star Pawan Kalyan meets dredging corporation of india employees and gives his support for their protest against privatisation of the company as a part of his ‘Chalo Re Chal’ tour.

ITEMVIDEOS: ఓట్లు వేసిన ప్రజలు అంకుశమై తిరగబడాలి: పవన్ కల్యాన్

Posted: 12/06/2017 01:47 PM IST
Pawan kalyan meets dci employees slams mps to solve issue

లాభాలను అర్జిస్తున్న ప్రభుత్వ సంస్థను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడానికే ఏవో అంశాలను తెరపైకి తీసుకువచ్చి ప్రైవేటీకరణ చేస్తున్నారని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ విమర్శించారు. బకాయిలను సాకుగా చూపి ఒక్క కుంభకోణం కూడా లేని సంస్థను నష్టాల బాట పట్టిస్తున్నారని అన్నారు. ఇదే కంపెనీకి దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల బకాయిలు వున్నాయన్న విషయం వాళ్లకి తెలియదా అన్నారు.  నష్టాలలో వున్న పరిశ్రమలను, అర్డర్లు లేక విలవిలలాడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం అమోదయోగ్యమే కాని, ఇలా లాభాలను అర్జించే కంపెనీల బకాయిలు పెట్టి నష్టాల పేరుతో అమ్మడం సమంజసం కాదని దుయ్యబట్టారు.

చలోరే చలోరే చల్ పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం విశాఖపట్నానికి చేరుకున్నారు. ఆయన రాకకోసం విశాఖ విమానాశ్రయం వద్ద పెద్ద సంఖ్యలో గుమ్మిగూడిన అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మధ్యాహ్నం సమయానికి పవన్ డ్రెడ్జింగ్ కార్పోరేషన్ అప్ ఇండియా సంస్థ వద్దకు చేరకున్నారు. అక్కడ కార్మిక సంఘం నేతలతో కలసి సంస్థ ప్రైవేటీకరణకు గల కారణాలను వారిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు అక్కడికి చేరుకోగానే ప్రైవేటీకరణ వార్తల నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తడికి లోనై తనవు చాలించిన కార్మికుడు వెంకటేష్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డీసిఐ ఉద్యోగులు తలపెట్టిన అందోళన కార్యక్రమాలకు మద్దతు తెలిపిన పవన్.. వారి దీక్షకు కూడా సంఘీబావం వ్యక్తం చేశారు.

ప్రత్యేక హోదాను హతమార్చారు..

రాష్ట్ర పునర్విభజన బిల్లులో పోందుపర్చిన పలు హామీలను అమలు చేయడంలో కేంద్రం ఇప్పటికే అన్యాయం చేసిందని అంగలార్చిన పవన్.. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేసి రాష్ట్రానికి మరింత అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే స్పెషల్ స్టేటస్ హామీని హతమార్చారని అయినా ఓపిక పట్టిన తమపై దెబ్బ మీద దెబ్బ వేస్తున్నారని అన్నారు. ఈ అంశం నుంచి తమ ప్రభుత్వం కాబట్టి ఎంపీ హరిబాబు తప్పించుకోవచ్చునెమో.. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ తప్పించుకోవచ్చునేమో గానీ.. గత సార్వత్రిక ఎన్నికల మీ ఓట్లు అడిగే క్రమంలో మీ సమస్యలను నేను పరిష్కరిస్తాను అని మాటిచ్చిన నేను ఆ మాటకు కట్టుబడి ఇప్పుడు నిలదీస్తున్నాను.. అని పవన్ అన్నారు.

ఓట్లు అడిగే హక్కు లేదు..

ప్రజా సమస్యలు పరిష్కరించలేని ఎంపీలకు, ఎమ్మెల్యేలకు రానున్న ఎన్నికలలో ప్రజలను ఓట్లు అడిగే హక్కు మాత్రం లేదని పవన్ కల్యాన్ నినదించారు. ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకువస్తారు.. వారి ఓట్లు గుర్తుకు వస్తాయని, కానీ అదే ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు మాత్రం తమకు పట్టనట్లు నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చూసి కడుపుమండి మాట్లాడుతున్నామని, రానున్న ఎన్నికలలో మీకు ప్రజల తమ బలమేంటో కూడా చూపిస్తారని అయన చురకలు అంటించారు. ప్రజా సమస్యల నుంచి తాను కానీ జనసేన కానీ తప్పించుకోదని అందుకనే నిలదీసేందుకు వచ్చానని అన్నారు. మీ వాడిగా, మీ కుటుంబ సభ్యుడిగా మన సమస్యలపై నేతలను నిలదీస్తున్నానని అన్నారు.

ఇంతకన్నా నిజాయితీగా బతకలేను

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లు తాను టీడీపీ పక్షమో, బీజేపి పక్షమో కాదని, తాను కేవలం ప్రజల ఫక్షమని చెప్పారు. భారతీయుల ఫక్షమే కానీ భారతీయ జనతా పార్టీ పక్షం కాదని మరోమారు పవన్ స్పష్టం చేశారు.. జనసేన పార్టీకి మాత్రం ప్రజా సమస్యల పట్ల బాధ్యత వుందని, తప్పించుకో చూడమని కూడా చెప్పారు. తాను ఇప్పటి వరకు రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వాన్ని కానీ, లేక కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని కానీ ఏమీ కావాలని అడగలేదని చెప్పారు. గత ఎన్నికలలో వీరిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తనవంతుగా కృషి చేశానే తప్ప.. అ కృతజ్ఞతను పేరుతో తనకు ఏదో ఒక లబ్ది చేకూర్చాలని తాను ఇప్పటి వరకు ఎవరినీ కోరలేదని పవన్ అన్నారు. ప్రజల తన కుటుంబమని చెప్పిన పవన్.. ప్రజలే తన జీవితంలో స్నేహితులని కూడా చెప్పారు.

కోడిగుడ్డు మీద ఈకలు పీకుతాం అంటే..

తాను ఎవరికి సాయం చేసినా.. వారి నుంచి ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తానని, ఎవరి నుంచి ఎలాంటి కనీస ఫేవర్ కూడా పోందాలని తాను భవించనన్నారు పవన్. తన నైతిక స్థైర్యం కోల్పోవద్దనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇంతకన్నా నిజాయితీగా బతకడం తనకు తెలియదని అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట్ర హోదా విషయమై ప్రస్తావించిన ఆయన దానికి కోన్ని కారణాలు చెప్పి మరుగున పడేశారని అన్నారు. అధికాంలో వున్నా ఏమైనా చేస్తామన్న ధోరణి సముచితం కాదన్న అన్నారు. అలా కాదంటే ఏం పీకుతారు.. కోడిగుడ్డు మీద ఈకలు పీకుతామంటే అలాగే చేయండని ఆయన సవాల్ విసిరారు. మీరలా చేస్తే ఏం చేయాలో మాకు తెలుసనని అన్నారు. ప్రజల కోసం అవసరమైతే జైలుకు వెళ్తాను.. రక్తాలు కార్చుకుంటానని అన్నారు.

డిసిఐ కార్మికులకు సంఘీభావం

ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటికరణ వ్యతిరేకిస్తూ నిరాహార దీక్షలు చేస్తున్న డిసిఐ ఉద్యోగుల సమస్యలపై అన్ని పార్టీలు సమిష్టిగా కలసి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని పవన్ కల్యాన్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించాలని కోరిన పవన్.. అదే వేదిక పై నుంచి విపక్ష పార్టీకి చేందిన అధినేత జగన్ కు కూడా విన్నవించారు. వీరితో పాటు అన్ని పార్టీలు కలసి కేంద్రం దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. ఇవాళ డిసిఐ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చారంటే అందులో వారి తప్పు కొంచం కూడా లేదని, ఇది తప్పించుకు తిరిగుతున్న ప్రజాప్రతినిధులు తప్పేనని పవన్ తేల్చిచెప్పారు. అయితే తాను ముఖ్యమంత్రి అయితే ఫలానా చేస్తానని తాను చెప్పనని, సమస్యలు వున్నప్పుడే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని చెప్పారు.

తప్పు చేస్తే నన్నైనా నిలదీయండీ

జనసేన తప్పుచేస్తే నన్నైనా నడిరోడ్డు మీద నిలదీసే హక్కు ప్రజలకుందని అన్న పవన్.. ప్రజాసమస్యల నుంచి తప్పించుకుని తిరిగుతున్న ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎందుకు నిలదీయకూడదని ప్రశ్నించారు. ఇక తన పార్టీ తరపున పోరబాట్లు జరగవచ్చునేమో కానీ తప్పులు మాత్రం జరగవని ఆయన ధీమాగా చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అనేక అంశాలు చిన్న చిన్న సమస్యలతో ఇంకా అపరిష్కృతంగానే వున్నాయని అన్నారు. స్పెషల్ స్టేటస్ సహా అనేక సమస్యలు వున్నాయని, ఇప్పుడు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు డిసిఐ ఆ తరువాత వైజాగ్ స్టీల్, ఆ తరువాత ఎయిరిండియా.. ఇలా అన్నింటినీ ప్రైవేటీకరణ చేయడం బారత వ్యవస్థకే సముచితం కాదని అన్నారు. ప్రజల సహిస్తారు, భరిస్తారు అదే అలుసుగా తీసుకుని వ్యవహరిస్తే అంకుశాలై మదపుటేనుగులను కూడా కట్టడి చేస్తారని పవన్ అన్నారు.

కాదంటే.. విశాఖ నుంచే పతనం ప్రారంభం..

డిసిఐ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆత్మహత్య చేసుకున్న కార్మికుడు వెంకటేష్ కుటుంబ పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని.. ఆ కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందిని.. ఆ తల్లిదండ్రులు పడుతున్న అవేదన ఎవరీకి రాకూడదని ఆయన అన్నారు. ఆ కుటుంబానికైనా ప్రజాప్రతినిధులు అండగా నిలవాలని.. వారికి నష్టపరిహారం ఇప్పించాలని పవన్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బీజేపి ప్రభుత్వం డిసిఐ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. ఇందుకోసం తొలిసారగా తాను ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాస్తున్నానని చెప్పారు. మా నిర్ణయంలో మార్పు లేదని బీజేపి భావించి ముందుకు వెళ్తే.. విశాఖ నుంచే ఆ పార్టీ పతనం ప్రారంభమవుతుందని పవన్ హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles