టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో ఎంట్రీతో అప్పటి వరకు జనం డబ్బును అప్పన్నంగా లాగేసుకన్న టెలికాం సంస్థలు కాస్తా ఇప్పుడు డబ్బును విధుల్చుకోక తప్పడం లేదు. జియో దెబ్బతో పోస్ట్-పెయిడ్, ప్రీ-పెయిడ్ కస్టమర్ల పంట పండుతోంది. ఇప్పటికీ పోస్ట్-పెయిడ్ ఛార్జీలను టెలికాం సంస్థలు భారీగా తగ్గించాయి. ఇప్పుడు ప్రీ-పెయిడ్ కస్టమర్లు జారిపోకుండా టెలికాం సంస్థలు పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా తమ ప్రీ-పెయిడ్ కస్టమర్ల కోసం ఐదు వినూత్న ప్లాన్స్‌ను వోడాఫోన్ ప్రకటించింది.
‘సూపర్ ప్లాన్స్’ పేరుతో కస్టమర్లకు అవసరమైన డేటా, ఎస్ఎంఎస్, అపరిమిత లోకల్, ఎస్టీడీ, నేషనల్ రోమింగ్ కాల్స్ అవసరాలను తీర్చేలా ఈ ప్లాన్‌ను తీసుకొచ్చారు. దీన్ని 2జీ లేదా 3జీ/4జీని సపోర్ట్ చేసే మొబైల్ ఫోన్లకు ఈ ప్లాన్స్‌ను వినియోగించుకోవచ్చు.
* రూ.509 ప్లాన్: రోజుకు 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అపరిమితమైన వాయిస్ కాల్స్ (లోకల్, ఎస్టీడీ, నేషనల్) వ్యాలిడిటీ 84 రోజులు
* రూ.458 ప్లాన్: రోజుకు 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అపరిమితమైన వాయిస్ కాల్స్ (లోకల్, ఎస్టీడీ, నేషనల్) వ్యాలిడిటీ 70 రోజులు
* రూ.347 ప్లాన్: రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమితమైన వాయిస్ కాల్స్ (లోకల్, ఎస్టీడీ, నేషనల్) వ్యాలిడిటీ 28 రోజులు
* రూ.199 ప్లాన్: నెలవారిగా 10 జీబి డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ (లోకల్, ఎస్టీడీ, నేషనల్) వ్యాలిడిటీ 28 రోజులు
* రూ.79ల రీఛార్జీపై 7 రోజుల వ్యాలిడిటీ ఉండే మరొక ప్లాన్‌ను తీసుకొచ్చారు.
దేశ వ్యాప్తంగా ఉన్న అందరు వొడాఫోన్ కస్టమర్లు ఈ ప్లాన్స్‌ను తీసుకోవచ్చు. తమ కస్టమర్ కేర్ సెంటర్లు లేదా మైవొడాఫోన్ మొబైల్ యాప్ ద్వారా ఈ ప్లాన్స్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చని వొడాఫోన్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more