cops fine man for driving a car without a helmet పోలీసులకు విశ్వరూపం చూపుతున్న విష్ణుశర్మ

Indian traffic cops fine man for not wearing helmet while driving car

challan, Bharatpur resident, Vishnu Sharma, Rajasthan, fine, Rs 200, Bharatpur, helmet, Maruti van, Agra-Jaipur highway, seat belt

Bharatpur resident, Vishnu Sharma, 23, was fined INR200 by Rajhastan Police as he was driving his van, without wearingon the Agra-Jaipur national highway for not wearing a helmet.

పోలీసులకు విశ్వరూపం చూపుతున్న విష్ణుశర్మ

Posted: 12/05/2017 04:17 PM IST
Indian traffic cops fine man for not wearing helmet while driving car

తెలియక చేసినా.. తెలిసి చేసినా తప్పు తప్పే అని వాదించే పోలీసులు మనకు బాగానే తెలుసు. అయితే అలాంటి పోలీసులు పోరబాటున తప్పు చేశామని చెప్పుకునే పరిస్థితిని తీసుకువచ్చాడు  ఆ యువకుడు. అతను సీటు బెల్టు పెట్టుకోలేదని ఫైన్ వేశాం. కానీ చాలానాలో మత్రం హెల్మెట్ అని రాశామని కవర్ చేసుకునే ప్రయత్నాలు. చేసినా.. ట్రాఫిక్ పోలీసులదే తప్పైవుంటుంది అన్న విధంగానే అర్థమవుతుంది. ఇక కొందరు మాత్రం ఎరక్కపోయి భలేగా ఇరుక్కున్నారు పోలీసులు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఒక్క రోజు తప్పిదానికి నేటి సాంకేతిక విప్లవం జోరందుకున్న రోజుల్లో పోలీసుల తప్పు ఇప్పుడు నిత్యం ప్రశ్నలను ఎదుర్కొంటుంది.

రాజస్థాన్ రాష్ట్రం. జైపూర్ లోని భరత్ పుర్ లోని సెవార్ పోలీస్ స్టేషన్ పరిధిలో కరేరా గ్రామంలో విష్ణుశర్మ నివాసం. వ్యాన్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. డిసెంబర్ 1వ తేదీ ఆగ్రా నుంచి తన గ్రామం కరేరాకు వెళుతున్నాడు. మార్గమధ్యంలో రాజస్ధాన్ ట్రాఫిక్ పోలీసులు ఆపారు. అన్ని పత్రాలు చూపించాడు శర్మ. చలానా రాయటానికి ఏమీ లేదు. అయినా వద్దల్లేదు పోలీసులు. హెల్మెట్ పెట్టుకోలేదనే కారణం చెప్పి.. వ్యాన్ డ్రైవర్ కు రూ.200 చలానా విధించారు. ఇదే విషయాన్ని అక్కడే గట్టిగా నిలదీశాడు శర్మ. అబ్బే పోలీసులు విననే వినలేదు. చలానా కట్టకపోతే వ్యాన్ సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. గత్యంతరం లేక రూ.200 చలానా కట్టాడు. ట్రాఫిక్ పోలీసులపై కసితో రగిలిపోయాడు.

డిసెంబర్ 2వ తేదీ ఓ హెల్మెట్ కొనుగోలు చేశాడు. వ్యాన్ డ్రైవింగ్ సీటులో కూర్చుని హెల్మెట్ తో డ్రైవింగ్ చేయటం మొదలుపెట్టాడు. టూరిస్టులను తిప్పే వ్యాన్ కావటంతో దేశ, విదేశాల నుంచి వచ్చే వాళ్లందరూ వింతగా చూడటం.. ఎందుకని ప్రశ్నించటం మొదలుపెట్టారు. జైపూర్ రోడ్లపై. ఆగ్రా హైవేపై మూడు రోజులుగా ఇలాగే జర్నీ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో బీభత్సం. మీడియాకి తెలిసింది. ఇంకేముందీ మొత్తం కథ చెప్పేశాడు.

నా దగ్గర డ్రైవింగ్‌ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, వెహికల్ రిజిస్ట్రేషన్‌, ఇన్సూరెన్స్‌ పేపర్లు ఇలా ప్రతీది ఉందని.. సీటు బెల్ట్‌ కూడా పెట్టుకున్నట్టు గట్టిగా చెప్పాడు. అయినా పోలీసులు హెల్మెట్‌ పెట్టుకోలేదనే కారణంతో చలానా విధించినట్టు తెలిపాడు. అందుకే హెల్మెట్‌ ధరిస్తున్నానని, ఎవరికి తెలుసు? మళ్లీ పోలీసులు ఎప్పుడు చలానా విధిస్తారో అంటూ ట్రాఫిక్ పోలీసుల తీరును ఎండగట్టాడు. అయినా ఒక్కసారి పొరపాటు చేస్తే ఇలా రోజూ గుర్తు చేసి మరీ చంపుతున్నాడు అంటూ ట్రాఫిక్ పోలీసులు రుసరుసలాడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles