Rs. 350 note real or hoax? రూ.350 నోటుపై క్లారిటీ ఇచ్చిన అర్బీఐ..

Morphed pictures of rs 350 notes are going viral on the internet

rs 350 notes, new indian currency notes, indian currency notes 2018, rbi new currencies, new indian currencies, indian rupees, rs 200 notes, new indian notes pics, pics of rs 350 notes, remonetisation, demonetisation, facebook, fake pictures.,morphed pictures, reserve bank of india

Don’t be surprised if you get to see a message on WhatsApp or on your timeline in facebook about the “imminent” launch of a Rs 350 note by the Reserve Bank of India.

రూ.350 నోటుపై క్లారిటీ ఇచ్చిన అర్బీఐ..

Posted: 12/05/2017 03:26 PM IST
Morphed pictures of rs 350 notes are going viral on the internet

పెద్ద నోట్ల రద్దు చేపట్టి దాదాపుగా ఏడాది పూరైంది. ఈ నేపథ్యంలో మొదట రెండు వేల రూపాయల కొత్త పెద్ద నోటును భారతీయ వ్యవస్థలోకి ప్రవేశపెట్టిన కేంద్రం.. ఆ తరువాత కొత్తగా ముద్రించిన రూ.500 నోటును మూడు నెలల వ్యవధిలో ప్రజల అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికీ ఈ రెండు నోట్లు మాత్రమే యావత్ దేశ ప్రజలకు అందుబాటులో వున్నాయి. వీటి తరువాత కొత్తగా ముద్రించిన రూ.200 నోటును కేంద్రం భారత వ్యవస్థలో ప్రవేశపెట్టినా.. అవి ఎలా వుంటాయి.. ఎక్కడ లభ్యమవుతాయన్న విషయం మాత్రం ఇప్పటికీ చూడని మెట్రో నగరవాసులు అనేకమంది వున్నారంటూ అతిశయోక్తి కాదేమో. కొత్త రూ,. 50 నోటుపై కూడా ఇలాంటి అభిప్రాయలే వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంకు మరో కొత్త నోట్లను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతోందన్న ప్రచారం జోరందుకుంది. వంద డినామినేషన్లో కాకుండా కొత్తగా అలోచించిన అర్బీఐ సరికొత్తగా.. కొత్త రూ.350 నోటును మార్కెట్లోకి విడుదల చేస్తుందని... త్వరలోనే రూ.2000 నోటును నిలుపుదల చేస్తుందంటూ సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాక కొత్తగా తీసుకురాబోతున్న రూ.350 నోటు ఇలానే ఉండబోతుందంటూ మార్ఫింగ్‌ చేసిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు కూడా. ఈ వార్తపై రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా స్పందించింది. ఇదంతా తప్పుడు వార్త అంటూ తేల్చి చెప్పింది. అంతేకాక సోషల్‌ మీడియాలో వచ్చే ఇలాంటి వార్తలను నమ్మొద్దని సూచించింది.

మార్ఫింగ్ చేసిన విడుదల చేసిన రూ.350 నోటు ఇమేజ్‌... వైల్డ్ రెడ్ కలర్ లో, ఆశ్చర్యకరమైన నమూనాల్లో ఉన్నాయి. ఈ నోటును కొత్త రూ.200, రూ.50 నోట్లను మార్ఫింగ్ చేసి రూపొందించినట్టు తెలిసింది. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అయ్యింది. ఈ ఇమేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవడంతో, నిజంగానే ఆర్బీఐ కొత్తగా రూ.350 నోటు తీసుకొస్తుందేమోనని ప్రజలు భావించారు. కానీ ఇదంతా తప్పుడు వార్తనేనని ఆర్బీఐ కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్నది అంతా అబద్దం అని.. ఎవరూ నమ్మొద్దని వెల్లడించింది. రూ.350 నోటు విడుదల చేసే ఆలోచన, ఉద్దేశం లేదని వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles