dad whose son both behind bars if son drives his vehicle పుత్రోత్సాహంలో అతి.. తండ్రి, తనయులు కటకటాల వెనక్కి..

Dad whose son both behind bars if son drives his vehicle

dad arrested for son's accident, srinivasulu, hari, shyamraju, father and son behind bars, driving, vehicle, motor cycle, bike, car, accident, kurnool police, andhra pradesh

dad whose son both behind bars if son drives his vehicle and commits accident, the same was done by kurnool police in andhra pradesh

పుత్రోత్సాహంలో అతి.. తండ్రి, తనయులు కటకటాల వెనక్కి..

Posted: 12/05/2017 02:46 PM IST
Dad whose son both behind bars if son drives his vehicle

కొడుకుకు ప్రేమతో అంటూ ఆ తండ్రి తన తనయుడికి ప్రేమతో ఇచ్చిన బైక్.. ఆ ఇద్దరినీ కటకటాల వెనక్కి నెట్టింది. తమ పిల్లలు సైకిల్ నడిపితే చూసి ముచ్చటపడే తండ్రులు.. బైకులు నడిపగలడని అంచనా వేసి.. వారికి కొత్త బైకులు కొనిస్తే.. ఇలా అరదండాలు పడతాయని ఈ ఘటన మరోమారు వెలుగులోకి తీసుకువచ్చింది. ఇదివరకే ఢిల్లీలోని ఓ బడా వ్యాపారవేత్త కుమారుడు తండ్రికి తెలియకుండా అతని కారు నడిపి ప్రమాదం చేసిన కేసులోనే ఇలాంటి శిక్ష విధించబడింది.

ఈ ప్రమాదంలో పలువురు గాయాలపాలుకాగా, ఇలాంటి ఘటనలు పలుమార్లు పునరావృతం అయ్యాయని విచారణలో తెలుసుకున్న అధికారులు ఆ పిల్లాడితో పాటు అతని తండ్రిపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు వారిద్దరినీ కటకటాల్లోకి నెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అంధ్రప్రదేశ్ లోనే ఇలాంటి ఘటన నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే, కర్నూలు జిల్లా గూడూరు మండలంలో తలారి శ్రీనివాసులు నివాసం ఉంటున్నాడు.

అతని కుమారుడు హరికిషోర్ కు ఎటువంటి వాహన లైసెన్సూ లేదు. తండ్రి బైక్ ను తీసుకుని వెళ్లిన హరి, వేగంగా వెళుతూ, శ్యామరాజు అనే వ్యక్తిని ఢీకొనగా, అతను చికిత్స పొందుతూ మరణించాడు. విచారణలో అతనికి లైసెన్స్ లేదని, బండి కూడా అతనిది కాదని తెలుసుకుని, శ్రీనివాసులును కూడా పిలిపించారు. తండ్రీ, కొడుకులను అరెస్ట్ చేసినట్టు చూపించి, ఇద్దరిపైనా హత్య కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఎవరి బైక్ ను వారే నడపాలని, తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే బండిని రోడ్డుపైకి తీసుకురావాలని, లైసెన్స్ లు లేని కొడుకులకు బండ్లు ఇవ్వరాదని పోలీసులు హెచ్చరికలను జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : srinivasulu  hari  shyamraju  motor cycle  bike  car  accident  kurnool police  andhra pradesh  

Other Articles