Modi govt weakened Lokpal Act: Anna Hazare మూడేళ్లలో 32 లేఖలు.. ఒక్కదానికి జవాబివ్వని మోడీ..

Wrote 32 letters to narendra modi got no reply anna hazare

Lokpal Act, Anna Hazare. Modi government, Hazare on Modi government, farmer's issues, crime, law and justice, corruption and bribery, UPA government,PM Modi,Lokpal Bill,Jan Lokpal,Corruption Movement,India

Social activist Anna Hazare has alleged that the Narendra Modi-led government at the Centre weakened the anti-corruption Lokpal Act.

మూడేళ్లలో 32 లేఖలు.. ఒక్కదానికి జవాబివ్వని మోడీ..

Posted: 12/04/2017 04:48 PM IST
Wrote 32 letters to narendra modi got no reply anna hazare

అవినీతి రహితంగా భారత నిర్మాణమే తన లక్ష్యమని చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీపై అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు, సామాజిక కార్యకర్త అన్నాహజారే మరోసారి విమర్శలు గుప్పించారు. ఆయన నిజంగా తాను ప్రకటించుకుటున్నట్లుగా అవినీతి వ్యతిరేక భారతదేశ నిర్మాణ స్వాప్నికుడే అయితే అదే లక్ష్యంతో తీసుకువచ్చిన అవినీతి నిరోధక లోక్‌పాల్ చట్టాన్ని ఎందుకు బలహీనపర్చారని ఆరోపించారు. మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో మూడురోజుల పాటు నిర్వహించిన 'జల్ సమ్మేళన్’లో పాల్గోన్న అన్నా హాజరే మాజీ ప్రధాని మన్మోహన్ కూడా ఈ బిల్లుకు తూట్లు పోడిచారన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లోక్ పాల్ బిల్లును ప్రవేశపెడుతున్న క్రమంలోనే బలహీనం చేస్తే.. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ దానిని మరింత బలోహీన పరిచారని ఆరోపించారు. 'మోదీ ప్రభుత్వం 2016 జూలై 27న పార్లమెంటులో లోక్ పాల్ చట్టానికి సవరణ చేయడం ద్వారా చట్టాన్ని మరింత బలహీనమైందని అవేదన వ్యక్తం చేశారు. దీని ద్వారా ప్రభుత్వాధికారుల భార్యలు, పిల్లలు, సంబంధీకులు ప్రతి ఏటా తమ ఆస్తుల వివరాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా పోయిందని ఈ మేరకు మోడీ సర్కారు సవరణ చేసిందని హాజారే అన్నారు.

ఒరిజనల్ చట్టం ప్రకారం,. ప్రభుత్వాధికారుల కుటుంబసభ్యులు తమ ఆస్తుల వివరాలు వెల్లడించడం తప్పనిసరి అని హజారే చెప్పారు. సవరణ బిల్లును ఎలాంటి చర్చా లేకుండా కేవలం ఒక్క రోజులోనే ఆమోదించారని, రాజ్యసభలో జూలై 28, 29లో దానిని ప్రవేశపెట్టారని తెలిపారు. కేవలం మూడు రోజుల్లోనే చట్టాన్ని బలహీనపరచారని హజారే మండిపడ్డారు. ఇదేనా అవినీతి రహిత భారత నిర్మాణమని ప్రశ్నించారు. దేశంలో అవినీతికి పాల్పడే వారిలో అధికశాతం ప్రభుత్వ అధికారులేనని అయన అరోపించారు. ఈ మేరకు ఏసీబి, ఐటీ దాడుల్లోబయటపడుతున్న వారి జాబితాలో అధికశాతం వారే వుంటున్నారని అన్నారు.

ఇదిలావుంటే.. సుమారు 70 శాతం వ్యవసాయ అధారితమైన భారత దేశంలో రైతులు తీసుకునే పంట రుణాలకు 1950 చట్టం ప్రకారం చక్రవడ్డీ విధించరాదన్న నిబంధన వుందని అయన తెలిపారు. అయితే బ్యాంకులు ఈ నిబంధనను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా చక్రవడ్డీలు వేస్తున్నారని అన్నారు. అయినా ఈ విషయంలో ఇప్పటికీ ప్రభుత్వం మిన్నకుంటోందని ఆయన అన్నారు. ఈ విషయంతో పాటు పలు సమస్యలపై తాను గత మూడున్నరేళ్ల నుంచి 32 ఉత్తరాలు రాశానని, అయితే ఒక్కటంటే ఒక్కదానికి కూడా ఇప్పటి వరకు బదులు రాలేదని అన్నారు. 60 ఏళ్లు పైబడిన రైతులకు రూ.5.000 చొప్పున పెన్షన్ ఇవ్వాలని హజారే డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lokpal Act  Anna Hazare  PM Narendra Modi  Manmohan singh  trending news  politics  

Other Articles

 • Rahul s hug everyone must maintain parliamentary decorum says speaker

  రాహుల్ జీ.. ఏమిటిదీ.? సభా గౌరవం ఏదీ.?

  Jul 20 | లోక్ సభలో అత్యంత ఆసక్తికరంగా సాగుతున్న అవిశ్వాస తీర్మాణంపై చర్చ సందర్భంగా ప్రకంపనలు సృష్టించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీరు పట్ల స్పీకర్ సుమిత్రా మహజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో ఆయన... Read more

 • Lalit modi nirav modi bade modi looting india says trinamool leader

  మోదీ త్రయం దేశానికి శాపం.. దోచేస్తున్నారన్న టీఎంసీ

  Jul 20 | కేంద్రంపై విశ్వాసం లేదనడానికి నిదర్శనమే టీడీపీ అవిశ్వాస తీర్మానమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగత్ రాయ్ విమర్శించారు. ప్రభుత్వంలోకి రాకముందు నుంచి మైత్రిని కొనసాగిస్తూ వచ్చిన మిత్రపక్ష పార్టీ.. నాలుగేళ్లు అధికారంలో వున్న... Read more

 • Waitress thrashes man for sexually assault in restaurant

  ITEMVIDEOS: తాకరాని చోట చేయ్యేస్తే.. తాట తీసింది..

  Jul 20 | తన పనుల్లో తాను నిమగ్నమై వుండగా, ఓ వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి జారుకుంటున్న నేపథ్యంలో అతడికి ఎదురొడ్డి నిలచి అటాకాయించి బుద్దిచెప్పిన మహిళ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి ప్రశంసలను అందుకుంటుంది.... Read more

 • Rahul gives jadoo ki jhappi to pm after a fiery session and winks to his mps

  పార్లమెంటులో ప్రధానికి రాహుల్ ‘‘జాదూకా జప్పీ’’..

  Jul 20 | అవిశ్వాసంపై చర్చ సందర్భంగా లోక్ సభలో ఎవరూ ఊహించని ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై తన ప్రసంగంలో రాహుల్ గాంధీ నిప్పులు చెరుగుతూ, ఓ వైపు నీతివంతమైన పాలన... Read more

 • Bjp s rakesh singh speaks in lok sabha on no confidence motion

  అవిశ్వాస చర్చ: రాఫెల్ ప్రకంపనలు సృష్టించిన రాహుల్ గాంధీ

  Jul 20 | గుజరాత్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఊటంకిస్తూ.. ఇవాళ తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం నేపథ్యంలో ఆయనకు తగినంత సమయం లభిస్తుంది.. అయనెలా భూ ప్రకంపనలను సృష్టిస్తారన్నది... Read more

Today on Telugu Wishesh