JC Pawan reddy sensational comments జేసీ పవన్ రెడ్డి ఆశలన్నీ పవన్ జనసేనపైనే..?

Jc diwakar reddy son political hopes in pawan kalyan janasena

jc diwakar reddy, chandrababu, JC Pawan reddy, Member of Parliament, Chiranjeevi, Pawan Kalyan, Jana Sena, TDP, YSRCP, Andhra Pradesh, Politics

JC Diwakar reddy's son JC Pawan reddy sensational comments on contesting forth coming general elections, says he will contest for MP to avail service to more number of people.

జేసీ పుత్రరత్నం పవన్ రెడ్డి ఆశలన్నీ పవన్ జనసేనపైనే..?

Posted: 12/04/2017 01:36 PM IST
Jc diwakar reddy son political hopes in pawan kalyan janasena

రానున్న సార్వత్రిక ఎన్నికలలో తాను పార్లమెంటు స్థానానికి పోటీ చేయబోనని.. ఎంపీలను కరివేపాకుల్లా చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి.. అప్పుడే మరో బాంబు కూడా పేల్చారు. తాను వద్దని విదుల్చుకుంటున్న దాన్ని తన కోడుకు అశపడుతున్నాడని, రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఆయన ఎంపీ పదవికి పోటీ చేస్తాడని కూడా చెప్పారు. అయితే పవన్ కల్యాన్ పార్టీ విషయమై ప్రప్తావన తీసుకువచ్చిన జేసీ.. చిరంజీవి ప్రజారాజ్యాన్ని విలీనం చేయకపోయివుంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాడు.

అయితే తాజాగా జేసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తన కుమారుడు, యువనేత పవన్ రెడ్డి విభేధించారు. జనసేన పార్టీ తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్న సందర్భంగా రాష్ట్రంలో అనేక రాజకీయ సమీకరణల్లో మార్పులు వస్తాయని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. అయితే పవన్ కల్యాన్ ఒంటిరిగా బరిలోకి దిగనున్నారా..? లేక మరేదైనా పార్టీతో పొత్తు పెట్టుకోనున్నారా.. అన్న అంశాలపై మాత్రం ఇంకా క్లారిటీ లేని సందర్భంగా తాను అప్పుడే ఏమీ చెప్పలేనని అన్నారు.

కాగా, రానున్న ఎన్నికలలో పవన్ ఇతర పార్టీలతో కలసి పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగితే మాత్రం తమ ప్రాంత ఓట్లన్నీ పవన్ కల్యాన్ పార్టీ జనసేన ఖాతాలోకే వెళ్తాయని అభిప్రాయపడ్డారు. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికలలో తనకు 2019 అసెంబ్లీకి బదులు పార్లమెంటుకు పోటీ చేయాలన్న అకాంక్ష వుందని, పార్లమెంట్ కు పోటీ చేసి గెలిస్తేనే ఎక్కువ మంది ప్రజలకు సేవ చేయవచ్చన్నది తన అభిమతమని పవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి లేని వ్యక్తినని అన్నారు.

రాజకీయాల్లోకి వస్తున్న పవన్ పోత్తుతో వస్తే మాత్రం తమ ప్రాంతంలోని సీట్లు జనసేనకు వెళతాయని ఆయన అంచనా వేశారు. అనంతపురం, తాడిపత్రి, హిందూపురం తదితర నియోజకవర్గాల్లో రాజకీయాలు మరో ఏడాదిన్నరలో ఎంతో మారనున్నాయని అభిప్రాయపడ్డారు. ఇక తాను మాత్రం పార్లమెంట్ సెగ్మెంట్ పైనే దృష్టిని పెట్టానని అన్నారు. పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడని అన్నారు, తన తండ్రి అన్నా ఆయనకు అభిమానం ఉందని, ఆయనకు ఎప్పటికీ రుణపడి వుంటామని అన్నారు. కానీ, ఇటీవలి కాలంలో ఆయనతో మాట్లాడలేదని చెప్పారు. పవన్ కల్యాణ్ కు తిక్కలేదని, లెక్క మాత్రం ఉందని పవన్ రెడ్డి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles