rape attempt on pregnant woman in telangana ఏడు నెలల గర్భిణిపై గ్యాంగ్ రేప్ యత్నం.. విషాదం..

Rape attempt on pregnant woman in telangana

gang rape, rape, pregnant woman gangraped, sexual assault on pregnant woman, sexual assault on pregnant woman, sexual assault in Telangana, gangrape attempt in medak, pregnant woman telangana police, pregnant woman, toopran, medak, gajwel, abduction, rape attempt, rape, gangrape, telangana police, crime

A pregnant woman was attempted gang rape in moving dcm van from hyderabad to toopran, in an attempt to escape she jumped from speeding vehicle and died

ఏడు నెలల గర్భిణిపై గ్యాంగ్ రేప్ యత్నం.. విషాదం..

Posted: 12/04/2017 12:40 PM IST
Rape attempt on pregnant woman in telangana

మానవత్వం మంటగలిసింది. మా దేశంలో మహిళలను శక్తిస్వరూపిణిలా ఆరాధిస్తామని, ప్రభుత్వ పథకాలలో వారికే ప్రాధాన్యతనిస్తామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయే.. తప్ప నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ఏ మాత్రం నిలువరించ లేకపోతున్నాయి. తెలంగాణలో అడపడచులపై కవ్వింపులకు, లైంగిక వేధింపులకు పాల్పడితే.. సహించేది లేదని, వారిపై కఠిన శిక్షలు తీసుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ మధ్యకాలంలో అబలలపై జరుగుతున్న దారుణాలపై దృష్టి సారించకపోవడం కూడా మగమృగాళ్లు తెగబడుతున్నారు.

తాజాగా సీఎం కేసీఆర్ ప్రాతినిత్యం వహించే (పాత) జిల్లాలో ఓ ఏడు నెలల గర్బణి అన్న కనికరం కూడా లేకుండా ఇద్దరు పైశాచిక మృగాళ్లు అత్యంత పాశవిక చర్యకు తెగబడ్డారు. దీంతో వారి నుంచి తప్పించుకునే క్రమంలో గర్బిణి వ్యాన్ నుంచి దూకి తన మానాన్ని కాపాడుకుంది. అయితే బలమైన గాయాలు కావడంతో పాటు రక్తస్రావం కూడా కావడంతో కొద్ది సమయంలోనే విఘతజీవిగా మారింది.

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం రావెళ్లి శివారులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... తూప్రాన్ మండలం రావెళ్లి పంచాయతీ పరిధి పోతరాజ్ పల్లికి చెందిన ఉడే రేగొండ, కళావతి దంపతులు పాతదుస్తులు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో పాతదుస్తులు విక్రయించిన కళావతి(35) రాత్రి 10 గంటల సమయంలో తన పెద్ద కుమార్తె శిరీష(7)తో కలిసి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న డీసీయం క్యాబిన్ లో ఎక్కి తన గ్రామానికి బయలుదేరింది. అందులో ఉన్న డ్రైవరు.. క్లీనర్ అమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అమెను తమకు సహకరించాలని దాడి కూడా చేశారు.

తాను దిగాల్సిన చోట డీసీఎం ఆపకుండా ముందుకు వెళ్తుండటంతో భయాందోళనకు గురైన కళావతి వ్యాన్ నుంచి కిందకు దూకింది. కళావతి దూకిన తరువాత అర కిలోమీటరు దూరం వరకు పోనిచ్చిన దుండగులు.. అక్కడ అమె కూతురు శిరీషతో పాటు పాతదుస్తుల మూటను రహదారి పక్కన వదిలేసి వెళ్లిపోయారు. అక్కడి నుంచి నడుచుకుంటూ బాలిక తిరిగి తల్లి దూకిన చోటకు వచ్చి ఆమెను లేపే ప్రయత్నం చేసింది. కదలకుండా పడి ఉండటంతో కొద్దిదూరంలో ఉన్న దాబా వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని అక్కడున్నవారికి వివరించింది. స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని కళావతి మృతిచెందినట్టు నిర్ధరించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pregnant woman  toopran  medak  gajwel  abduction  rape attempt  rape  gangrape  telangana police  crime  

Other Articles

 • Rahul s hug everyone must maintain parliamentary decorum says speaker

  రాహుల్ జీ.. ఏమిటిదీ.? సభా గౌరవం ఏదీ.?

  Jul 20 | లోక్ సభలో అత్యంత ఆసక్తికరంగా సాగుతున్న అవిశ్వాస తీర్మాణంపై చర్చ సందర్భంగా ప్రకంపనలు సృష్టించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీరు పట్ల స్పీకర్ సుమిత్రా మహజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో ఆయన... Read more

 • Lalit modi nirav modi bade modi looting india says trinamool leader

  మోదీ త్రయం దేశానికి శాపం.. దోచేస్తున్నారన్న టీఎంసీ

  Jul 20 | కేంద్రంపై విశ్వాసం లేదనడానికి నిదర్శనమే టీడీపీ అవిశ్వాస తీర్మానమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగత్ రాయ్ విమర్శించారు. ప్రభుత్వంలోకి రాకముందు నుంచి మైత్రిని కొనసాగిస్తూ వచ్చిన మిత్రపక్ష పార్టీ.. నాలుగేళ్లు అధికారంలో వున్న... Read more

 • Waitress thrashes man for sexually assault in restaurant

  ITEMVIDEOS: తాకరాని చోట చేయ్యేస్తే.. తాట తీసింది..

  Jul 20 | తన పనుల్లో తాను నిమగ్నమై వుండగా, ఓ వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి జారుకుంటున్న నేపథ్యంలో అతడికి ఎదురొడ్డి నిలచి అటాకాయించి బుద్దిచెప్పిన మహిళ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి ప్రశంసలను అందుకుంటుంది.... Read more

 • Rahul gives jadoo ki jhappi to pm after a fiery session and winks to his mps

  పార్లమెంటులో ప్రధానికి రాహుల్ ‘‘జాదూకా జప్పీ’’..

  Jul 20 | అవిశ్వాసంపై చర్చ సందర్భంగా లోక్ సభలో ఎవరూ ఊహించని ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై తన ప్రసంగంలో రాహుల్ గాంధీ నిప్పులు చెరుగుతూ, ఓ వైపు నీతివంతమైన పాలన... Read more

 • Bjp s rakesh singh speaks in lok sabha on no confidence motion

  అవిశ్వాస చర్చ: రాఫెల్ ప్రకంపనలు సృష్టించిన రాహుల్ గాంధీ

  Jul 20 | గుజరాత్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఊటంకిస్తూ.. ఇవాళ తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం నేపథ్యంలో ఆయనకు తగినంత సమయం లభిస్తుంది.. అయనెలా భూ ప్రకంపనలను సృష్టిస్తారన్నది... Read more

Today on Telugu Wishesh