countdown to Aadhaar linking deadlines.. అధార్ లింక్.. డెడ్ లైన్ వచ్చేస్తోంది త్వరపడండీ..

Aadhaar linking deadlines for these 6 services are fast approaching

LIC policy, Aadhaar, Life Insurance Corporation, LIC policy linking with Aadhaar, pan card linking with Aadhaar, mutual fund linking with Aadhaar, mobile phone linking with aadhaar, bank account linking with aadhaar, post office schemes linking with Aadhaar

The deadlines for linking aadhaar card with all the 6 services is mandatory according to government, and these are fast approaching, so if you haven’t done it yet, it’s time to get a move on.

అధార్ లింక్.. డెడ్ లైన్ సమీపిస్తోంది త్వరపడండీ..

Posted: 12/04/2017 12:00 PM IST
Aadhaar linking deadlines for these 6 services are fast approaching

ఆధార్ వ్యక్తిగత గోప్యత అంటూ ఓ వైపు స్వరోన్నత న్యాయస్థానం తీర్పును స్పష్టం చేసినా.. దానిని తప్పనిసరిగా అరు సర్వీసులకు అనుసంధానం చేయాలని ప్రభుత్వ ఇప్పటికే అదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో.. మరింత గడువు లభిస్తుందా..? లేక ఇదే చివరి తేదిగా ప్రకటించనుందా..? అన్న అనుమానాలు వ్యక్తమతున్నక్రమంలో ఆరు సర్వీసులకు మాత్రం తుది గడువు దగ్గరకు వచ్చేసింది. 2017, డిసెంబర్ 31 తర్వాత వీటికి ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే చెల్లింపులు నిలిచిపోనున్నాయి. సంక్షేమ పథకాల ద్వారా వచ్చే లబ్దిని పొందలేరు. మీ కార్డులు చెల్లుబాటుకావు.

2017, డిసెంబర్ 31తో ఆధార్ లింక్ చేయాల్సిన లిస్ట్ ఇలా ఉంది :

పాన్ కార్డు
బ్యాంక్ అకౌంట్
ప్రభుత్వ పథకాలు (రేషన్, పెన్షన్, ఉచిత వైద్యం, ఫీ రీయింబర్స్ మెంట్)
బీమా పాలసీలు
క్రెడిట్ కార్డులు
పోస్టాఫీస్ పథకాలు
మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ షేర్లు

2018, జనవరి 1 తర్వాత వీటిని ఆధార్ తో లింక్ చేయకపోతే మీరు బీమా చెల్లింపులు చేయలేరు. అదే విధంగా బీమా మొత్తాలను పొందలేరు. ఐటీ రిటర్న్ లను పరిశీలించరు. రిటర్న్ లను ఫైల్ చేయాల్సిన అవసరం లేని వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ కాలంలో బ్యాంక్ ఖాతా, బీమా పాలసీలు కామన్. నెలాఖరులోగా ఆధార్ లింక్  చేయకపోతే లావాదేవీలు నిలిపేవేసే అవకాశం ఉంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డు ఉన్న ఆధార్ నెంబర్ లింక్ చేయాలని రోజూ SMS మెసేజ్ ఇస్తున్నారు. జనవరి తర్వాత కార్డు ద్వారా లావాదేవీలు జరగపటంపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది

ఇప్పటికే మీరు గృహరుణాలు, ఇతర ఫైనాన్స్ సంస్థల తీసుకున్న అప్పుకి కూడా ఆధార్ అనుబంధానం చేయాలి. లేకపోతే ఆయా ఖాతాల ద్వారా లాదేవీలు ఆగిపోనున్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్దిపొందే వారు అంటే పెన్షన్, రేషన్, ఫీజు రీయింబర్స్ మెంట్ పొందాలంటే కచ్చితంగా డిసెంబర్ 31, 2017లోగా ఆయా ఖాతాలకు అధార్ నెంబర్ ను లింక్ చేసుకోవాలి. లేకపోతే వాటి ప్రయోజనాలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mutual fund  Mobile number  Bank account  Aadhaar linking  Aadhaar deadline  AADHAAR  postal schemes  

Other Articles