Cabbie tries to abduct woman judge మహిళా జడ్జీనే కిడ్నాప్ చేయబోయిన క్యాబ్ డ్రైవర్

Cab driver allegedly tries to kidnap woman judge

woman, Delhi High Court, cabbie, abduct, Woman judge abduction, Delhi high court judge abduction, Delhi High Court, Cabby abducts judge, Makhija Travels, Rajeev, kidnap attempt, judge kidnap attempt, delhi, crime

A woman judge alleged that her cab driver tried to abduct her while driving her to court, triggering the intervention of the Delhi high court, which has communicated its concern over safety of judges to the government.

షాకింగ్: జడ్జీనే కిడ్నాప్ చేయబోయిన క్యాబ్ డ్రైవర్

Posted: 11/28/2017 03:05 PM IST
Cab driver allegedly tries to kidnap woman judge

దేశరాజధానిలో నేరగాళ్లకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. మరీ ముఖ్యంగా దేశ రాజధానిలో ఆడపడచులపై జరుగుతున్న దారుణాలు నిలువరించలేకపోతున్నారు అక్కడి పోలీసులు. ఆ మధ్య ఉబర్ టాక్సీ సర్వీసుల డ్రైవర్లు.. క్యాబ్ బుక్ చేసుకున్న ఒంటరి మహిళలను దారి మళ్లింది అఘాయిత్యాలు చేసిన ఘటనను వెలుగుచూడగా, తాజాగా ఓ ప్రైవేటు క్యాబ్ డ్రైవర్ ఏకంగా మహిళా న్యాయమూర్తిని దారిమళ్లించి అపహరించబోయాడు.

దీంతో మహిళా న్యాయమూర్తికే రక్షణ కరువైన ఘటన చోటుచేసుకోవడంతో దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేపుతోంది. దారి మళ్లించిన క్యాబ్ డ్రైవర్ తనను ఇతర మార్గంలో తీసుకెళ్తున్నాడని గుర్తించిన న్యాయమూర్తి అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించడంతో.. అమె క్యాబ్ డ్రైవర్ నుంచి తప్పించుకోగలిగింది. రంగంలోకి దిగిన పోలీసులు అమె ఇచ్చిన సమాచారం మేరకు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు.

ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... కర్ కర్ దుమా కోర్టుకు వెళ్లేందుకు మహిళా న్యాయమూర్తి ఒక క్యాబ్ ను బుక్ చేసుకున్నారు. అనంతరం కోర్టుకు హాజరయ్యేందుకు ఎక్కారు. కర్‌ కర్‌ దూమా కోర్టుకు వెళ్లాల్సిన క్యాబ్ ను డ్రైవర్ జాతీయ రహదారి-24 పై ఉన్న హపూర్‌ వైపు మళ్లించి వేగం పెంచాడు. దీంతో ఆమె వెంటనే అప్రమత్తమై తన సహచరులు, పోలీసులకు సమాచారం అందించారు.

కొంత దూరం వెళ్లిన తరువాత క్యాబ్ డ్రైవర్ యూటర్న్ తీసుకుని ఢిల్లీ దిశగా క్యాబ్ ను పోనిచ్చాడు. దీంతో కారును వెంబడించిన పోలీసులు ఘాజిపుర్‌ టోల్‌ ప్లాజా వద్ద కారును ఆపి అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో అత్యాచారాలు, కిడ్నాపులు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏకంగా మహిళా న్యాయమూర్తిని కిడ్నాప్ చేసే ప్రయత్నం జరగడం ఢిల్లీలో మహిళా రక్షణపై తీవ్ర ఆందోళన రేపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi police  lady judge  cab driver  abduction  gazipur  judge kidnap attempt  delhi  crime  

Other Articles