Elephant Tramples Man Who Tried To Take Selfie | గజరాజుతో సెల్ఫీకి యత్నించి.. ప్రాణాలు కొల్పోయాడు

Elephant tramples man who tried to take its photo on bengal highway

elephant, Jalpaiguri, Sadik Rahman, security guard, Jalpaiguri bank, selfie, national highway, photograph, west bengal

Sadik Rahman, 40, a security guard at a Jalpaiguri bank, was on his way to work at the time and made the unfortunate mistake of getting out of his car to take photographs of the elephant

ITEMVIDEOS: సెల్ఫీ కోసం యత్నిస్తే ప్రాణం పోయింది

Posted: 11/24/2017 12:58 PM IST
Elephant tramples man who tried to take its photo on bengal highway

ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు యత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. జల్ పాయ్ గురి జిల్లాకి చెందిన సాదిఖ్ అనే 40 ఏళ్ల వ్యక్తి స్థానిక బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం సాయంత్రం తన విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరి వెళ్లారు.

లతాగురి అటవీ ప్రాంతం నుంచి వాహనంపై వెళుతుండగా అటుగా వెళ్తున్న ఓ ఏనుగు కంటపడింది. దాంతో సరదాగా సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. దగ్గరికి వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు యత్నించగా అది సాదిఖ్ పై తొండంతో దాడి చేసింది. అటుగా వెళుతున్న ప్రయాణికులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.ఆ తర్వాత ఏనుగు అడవిలోకి వెళ్లిపోవడంతో సాదిఖ్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతిచెందాడు.

జల్ పాయ్ గురి ప్రాంతంలో ఏనుగులు ఎక్కువగా సంచరిస్తుంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. సెల్ఫీల కోసం వాటి జోలికి వెళితే వారికే ప్రమాదమని, అటుగా వాహనాల్లో వెళుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. గతేడాది ఇదే ప్రాంతంలో ఏనుగుల దాడిలో 84 మంది చనిపోయినట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : elephant  Jalpaiguri  Sadik Rahman  selfie  national highway  photograph  west bengal  

Other Articles