Major quake likely to hit north India, says seismology chief పెను ప్రళయం.. హిమాలయాలే కేంద్రం..

Major quake likely to hit north india says chief of seismology centre

major earthquake, Himalayas, magnitude 8, Uttarakhand, Garhwal Himalaya, northern India, National Centre for Seismology, Director Dr. Vineet Gehlot, 700 years, safe building codes, low lands

A major earthquake of magnitude 8 is due to hit Uttarakhand's Garhwal Himalaya which could afflict widespread damage in northern India, warned National Centre for Seismology Director Dr. Vineet Gehlot

ఉత్తర భారతంలో పెను ప్రళయం.. హిమాలయాలే కేంద్రం..

Posted: 11/23/2017 09:54 AM IST
Major quake likely to hit north india says chief of seismology centre

హిమాలయ పర్వతాల్లో భారీ భూకంపం సంభవిస్తుందని దీని ప్రభావం ఉత్తర భారతావనితో పాటు పాకిస్థాన్ పై కూడా వుంటుందని కేరళ జోతిష్యుడు చెప్పిన నెల రోజులకు భారత జాతీయ భూకంప అద్యయన కేంద్రం కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది. హిమాలయ పర్వతాల కేంద్రం భారీ భూకంపం సంభవించనుందని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం డైరెక్టర్ వినీత్ గెహ్లాట్ తెలిపారు. ఈ మేరకు అక్కడి ప్రజలు అప్రమత్తంగా వుండాలని పలు సూచనలు సలహాలను అక్కడి ప్రజలకు ఇచ్చారు.

ఈ మేరకు ఆయన ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ లో మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని గర్వాల్‌ హిమాలయాల కేంద్రంగా ఈ భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని అన్నారు. ఈ భూకంప తీవ్రత ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలపై కూడా పడుతుందని హెచ్చరించారు. ఈ పెను భూకంపం ధాటికి ప్రళయం సంభవించి.. విపత్కర పరిణామాలు, ప్రాణ, అస్తి నష్టం సంభవిస్తుందని కూడా సూచించారు. అయితే గత ఏడు నుంచి ఎనమిది శతాబ్దాలుగా ఇక్కడ భూప్రళయం సంభవించకపోవడమే ఇందుకు కారణంగా చెప్పుకోచ్చారు.

ఉత్తరాఖండ్ హిమాలయ పర్వతాలలో శతాబ్దాలుగా భూకంపం సంభవించలేదని, దీంతో గత వందేళ్లుగా ఇక్కడ భారీ భూకంపం సంభవించేందుకు శక్తిని కూడగట్టుకుంటుందని తెలిపారు. దీంతో అతి త్వరలోనే ఈ ప్రాంతంలో భారీ భూకంపం అతలాకుతలం చేయనుందని హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాఖండ్ లో లభించిన వివరాల ప్రకారం చేసిన అధ్యయనంలో ఇది తేలిందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే భవనాలను సరైన ప్రణాళికతో నిర్మించాలని ఆయన హెచ్చరించారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే నష్టం తీవ్రత తగ్గించే అవకాశం ఉందని ఆయన సూచించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles