Family protests over Rs 15 lakh hospital bill కార్పోరేట్ మార్క్ దోపిడి.. పక్షం రోజులకు.. రూ.16 లక్షల బిల్లు.. అయినా

Gurgaon s fortis bills rs 16 lakhs to family of 7 yr old dengue victim

dengue, dengue death, gurgaon dengue death, fortis hospital, fortis hospital dengue death, fortis hospital dengue patient, Delhi corporate hospital, Gurgaon hospital, Dengue, Delhi, Fortis Memorial Research Institute, adya, latest

The girl, Adya Singh, was diagnosed with dengue and her condition deteriorated August 31. She was put on ventilator the next day.

కార్పోరేట్ మార్క్ దోపిడి.. పక్షం రోజులకు.. రూ.16 లక్షల బిల్లు.. అయినా

Posted: 11/21/2017 01:01 PM IST
Gurgaon s fortis bills rs 16 lakhs to family of 7 yr old dengue victim

వైద్యో నారాయణ హరి’ అని, వైద్యుడు దేవుడితో సమానమనివారిని అశ్రయించే రోగులు, వారి బంధువులు బావిస్తున్నా.. రోగులును మాత్రం వైద్యులు మనుషులన్న విషయాన్ని కూడా మర్చిపోయి.. కేవలం వారి నుంచి ఎంతమేరకు సాధ్యమైతే అంతవరకు వారి ధనాన్ని పిండుతున్నారే తప్ప.. కనీసం వ్యాధి నయమయ్యేందుకు కూడా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్వవహరిస్తున్నారు. ఈ తరహా దోపిడీలలో కార్పోరేట్ అస్పత్రులది మరీ అందవేసిన చెయ్యి అని చెప్పడంలో సంషయమే అవసరం లేదని ఈ ఘటన రుజువుచేస్తుంది.

జీఎస్టీ విధానం అమలు చేసి.. వైద్యాన్ని ప్రైవేటీకరణ చేసి.. వైద్యులుగా తయారయ్యే ప్రతీ డాక్టరుకు ప్రభుత్వాలు ప్రజల నుంచి వసూలు చేసిన ప్రజాధానాన్ని వెచ్చిస్తున్నా.. అ విషయాలేమీ పట్టక.. మా తెలివితేటలతోనే వైద్యులం అయ్యామన్న ధోరణిలో.. ఇక తెల్ల కోటు వచ్చిందని, అధికారికంగా వైట్ కాలర్ మాటున దోపిడికి లైసెన్సు వచ్చిందనన్నట్లు వ్యవహరించే వైద్యులు జనం మధ్యలో పెద్దమనుషులుగా చెలామణి అవుతున్నా.. నిబద్ధతతో రోగుల ప్రాణాలు కాపాడాల్సిన వీళ్లు.. మానవత్వం మంటగలుపుతున్నారు. తాము తినేది, తాగేది కేవలం డబ్బే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. డబ్బుకు మీదున్న శ్రద్ధ.. ప్రాణాలపై లేకుండా పోయింది.

తాజాగా దేశరాజధానిలో వెలుగుచూసిన ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం మాటలలో చెప్పలేనిది. పక్షం రోజులుగా డెంగ్యూ వ్యాధికి చికిత్స చేసిన వైద్యులు.. వ్యాధిని నయం చేయలేదు.. కనీసం అమెను బతికించేందుకు కూడా చర్యలు చేపట్టలేదు. కానీ వ్యాధిబారిన పడిన చిన్నారి తల్లిదండ్రుల నుంచి మాత్రం లక్షల వసూలు చేసింది. రెండు వారాలు పాపను ఐసీయూలో ఉంచి.. చివరికి చేతులేత్తెసి, 16 లక్షల రూపాయల బిల్లు కట్టించుకుని తీసుకెళ్ళమన్నారు. ఆ ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలోనే బాలిక కన్నుమూసింది.

ఢిల్లీ సమీపంలోని గుర్ గామ్ లో ఏడేళ్ల ఆద్యాసింగ్‌కు ఆగస్టు 27న జ్వరం వచ్చింది. బాలికను ద్వారకాలోని రాక్లండ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. చిన్నారికి డెంగీగా నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు ఆద్య తల్లిదండ్రులకు సూచించారు. దీంతో తల్లిదండ్రులు ఆగస్టు 31న గుర్గావ్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్‌కు అద్యను తీసుకువచ్చారు. డబ్బు కట్టించుకున్న తరువాత అస్పత్రిలో చేర్పించుకున్న అద్యకు అక్కడి వైద్యులు చికిత్సను ప్రారంభించారు.

అప్పటికే ప్లేట్ లేట్స్ సంఖ్య పడిపోయింది. చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 10 రోజులు ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు. సెప్టెంబర్ 14న MRI స్కానింగ్ తీయించారు. రిపోర్టులో ఆద్య మెదడు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నట్లు తేలింది. ఇక వైద్యం చేయలేమని డాక్టర్లు చేతులేత్తెశారు. ఈ 15 రోజులకు రూ.16 లక్షల బిల్ చేశారు ఫోర్టిస్ వైద్యులు. బిల్లుకు సంబంధించి 20 పేజీలతో వివరణ ఇచ్చారు. చేసేదేమి లేక 16 లక్షలు చెల్లించి.. మళ్లీ తిరిగి రాక్లాండ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సరిగ్గా సెప్టెంబర్ 14 అర్ధరాత్రి ఆద్య కన్నుమూసింది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

ఫోర్టిస్ ఆస్పత్రే చిన్నారి ప్రాణాలు బలికొంది

ఇదే విషయాన్ని ఆద్య సింగ్ తండ్రి మిత్రుడు.. నవంబర్ 17న ట్విట్టర్‌లో ప్రస్తావించాడు. 15 రోజులు డెంగీకి చికిత్స చేసి చివరకు చిన్నారి ప్రాణాలను ఫోర్టిస్ ఆస్పత్రి బలిగొందని ట్వీట్ చేశారు. అంతే కాకుండా రూ. 16 లక్షల బిల్ చేశారని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై స్పందించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. ఆ వివరాలన్ని తమకు ఇవ్వండి.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని జేపీ నడ్డా రీట్వీట్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఆరోగ్య కార్యదర్శికి మంత్రి నడ్డా ఆదేశాలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles