Wifi Dabba, to beat Jio at its own game జియోతో పోరుకు సై అంటున్న వైఫై డబ్బాలు

100 mb internet for rs 2 this startup wants to beat jio at its own game

Y Combinator, Wifi Dabba, Vodafone, Jio, isp, IoT, Airtel, Shubhendu Sharma, Karam Lakshman, bengaluru, karnataka

Wifi Dabba, the company has already installed 350 routers or dabbas across the city of Bengaluru and Sharma claims the startup has over 1800 connection requests in-waiting.

జియోను దెబ్బకొట్టేందుకు సన్నధమవుతున్న వైఫై డబ్బాలు..

Posted: 11/20/2017 06:24 PM IST
100 mb internet for rs 2 this startup wants to beat jio at its own game

టెలికాం రంగంలో డాటా యూసేజ్ తో ప్రత్యర్థి కంపెనీలను చిత్తు చేసి.. అనతికాలంలోనే వాటికి పోటీగా అవతరించిన రిలయన్స్ జియో.. తనకు ఎదురులేదని భావిస్తున్న క్రమంలో ఓ చిన్న స్టార్టప్ కంపెనీ ఏకంగా జియోతో పోటీకి సై అంటూ కాలుదువ్వుతుంది. శరవేగంగా వస్తున్న మార్పులతో కొత్త ఆలోచనలకు అవిష్కృతం కానుంది. దీంతో రిలయన్స్ జియో అందించే ధర కన్నా తక్కువలోనే డేటాను అందిస్తామని ఈ డాటా కంపెనీ ప్రకటించేస్తుంది. ఎక్కడ కావాలంటే అక్కడ వైఫైతో కనెక్ట్ అయ్యి వాడేసుకోండి అంటోంది బెంగళూరు కు చెందిన ఇంటర్నెట్ డేటా స్టార్టప్ కంపెనీ.

మొబైల్ రంగంలో సెల్ ఫోన్ల రాకతో ఎస్టీడీ, ఐఎస్డీ ఫోన్ బూతులు కాలగర్భంలో కలిపేసి.. వాటిస్థానంలో ఎక్కడ పడితే అక్కడ రూపాయి కాయిన్ తో ఫోన్ చేసుకునే కాయిన్ బాక్స్ ఫోన్లు విప్లవం తీసుకువచ్చినట్లుగానే.. ఇప్పుడు ఈ కంపెనీ వైఫై డబ్బాలను తీసుకొచ్చింది. బెంగళూరులో ఇప్పుడు ఏ చిన్న షాపు దగ్గర చూసినా ఈ డబ్బాలు దర్శనం ఇస్తున్నాయి. బెంగళూరు సిటీలో 350 వైఫై డబ్బాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. మరో 1800 కనెక్షన్స్ పెండింగ్ లో ఉన్నాయని చెబుతున్నారు కంపెనీ ప్రతినిధులు

రూటర్లను డబ్బాల్లో వివిధ ప్రాంతాల్లో వున్న పాన్ షాపులు, లేదా బేకరీలు లేదా కూల్ డ్రింక్ పాయింట్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసి.. అవి సుమారుగా 200 మీటర్ల దూరం వరకు కనెక్ట్ అయ్యేలా ఏర్పాటు చేస్తారు. దీంతో ఆ పరిధిలోని వున్న వారు వైఫై డబ్బాల నుంచి డేటాను వినియోగించుకోవచ్చు. ఇక దాని స్పీడు ఏకంగా 50 ఎంబిపీఎస్ వుంటుందని కూడా కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ డబ్బాలు అందించే డాటా చాలా చవక. 100ఎంబి – రూ.2, 500ఎంబి – రూ.10, 1 జీబి – రూ.20. 24 గంటల వ్యాలిడిటీతో ఈ ప్యాకేజీలు అందుబాటులో వుంటాయి.

ఈ వైఫై డబ్బాలు వున్న దుకాణాల్లో డేటా కార్డును మీ అవసరానికి అనుగూణంగా తీసుకుని దానిని మీ మొబైల్ లో ఎంటర్ చేయాలి. వెంటనే ఆ ఫోన్ కు ఓటిపి వస్తుంది. ఓటిపీ నెంబర్ ను డాటా వెబ్ పేజ్ లో ఎంటర్ చేస్తే ఇక మీ ఫోనుకు డేటా అందుతుంది. మొబైల్ ప్రీ పెయిడ్ కస్టమర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. కనీసం రూ.2 నుంచి రూ.20 వరకు ప్యాకేజీలు ఉన్నాయి. 1జీబి డేటాను 20 రూపాయలకే అందిస్తున్నారు. ప్యాకేజీలతో కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు 2, 10 రూపాయల్లో వైఫై డబ్బా అందుబాటులో ఉండటంతో తమ జేబులు పథిలంగా వున్నాయంటున్నారు స్థానికులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Y Combinator  Wifi Dabba  Vodafone  Jio  isp  IoT  Airtel  Shubhendu Sharma  Karam Lakshman  bengaluru  karnataka  

Other Articles