BJP Minister peeing in public goes viral వైరల్: మంత్రికి అర్జెంటని.. స్వచ్ఛాభారత్ కు తూట్లు..!

Bjp minister ram shinde caught urinating on roadside

water conservation minister,Solapur,Ram Shinde, maharastra, Ram Shinde video clip, Ram Shinde viral video, swacch bharat, PM Modi, Narendra Modi

The Maharashtra government was caught on the hop after a video of the state Water Conservation Minister Ram Shinde purportedly urinating on the roadside went viral on social media.

వైరల్: మంత్రికి అర్జెంటని.. స్వచ్ఛాభారత్ కు తూట్లు..!

Posted: 11/20/2017 03:01 PM IST
Bjp minister ram shinde caught urinating on roadside

దేశంలో స్వచ్ఛాభారత్ మిషన్ ఎక్కడ కనిపిస్తుందని అడిగితే ఏ తరగతి పాఠశాల విద్యారథైనా ఠక్కున చెప్పేస్తారు టీవీలో అని. కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్న స్వచ్ఛాభారత్ అక్టోబర్ రెండు ప్రముఖుల ఫోటోలకు, వీడియోల కోసం చేసే హాడావిడికి పరిమితం అవుతుంది. అంతేకానీ నిజంగా దేశంలో ఒక్క శాతం మంది కూడా స్వచ్చా భారత్ మిషన్ కోసం పూర్తిగా తమ సమయాన్ని కేటాయించడం లేదు. అసలు అ మిషన్ ఉద్దేశ్యాలు ఏమిటో కూడా తెలియని దేశ ప్రజలు వున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు.

ఈ విషయాన్ని అలా వుంచితే ఏకంగా మొన్న కేంద్రమంత్రి మార్గమథ్యంలో తన కాన్వాయ్ ను అపి రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేయగా, తాజాగా మహారాష్ట్ర నీటి పరిరక్షణ మంత్రి రామ్‌ షిండే అదే తరహా వివాదంలో చిక్కుకున్నారు. రోడ్డు పక్కన మంత్రి బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్న ఆయనకు చెందినదిగా అభియోగిస్తున్న ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది. సాక్ష్యాత్తు మంత్రివర్యులే ఇలా చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోలాపూర్‌-బార్షీ మార్గంలో ప్రయాణిస్తున్న మంత్రి రామ్ షిండే.. మార్గమధ్యంలో వాహనంలోంచి దిగి రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో మంత్రి వివరణ ఇచ్చుకున్నారు. తాను అనారోగ్యంగా ఉన్నానని... ‘జల్ యుక్తా శివార్‌’ పథకం కోసం నెలరోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా తీరిక లేకుండా తిరుగుతున్నాననని.. వరుస ప్రయాణాలతో తాను అనారోగ్యానికి గురయ్యానని చెప్పారు. అయితే బార్షీ వెళ్లే మార్గంలో తనకు ఎక్కడా టాయ్ లెట్ కనిపించలేదని.. దీంతోనే తాను రోడ్డు పక్కనే మూత్ర విసర్జన చేయాల్సి వచ్చిందన్నారు.

అయితే రామ్ షిండేపై విపక్ష ఎన్సీపీ మండిపడింది. జాతీయ రహదారిపై ఓ మంత్రే టాయిలెట్ లేదని చెబుతుంటే.. ఇక నరేంద్రమోదీ స్వచ్ఛభారత్‌ పథకం ఏ విధంగా ఉందో అర్థమవుతోందని విమర్శించారు. ‘ఈ ఘటనతో స్వచ్ఛభారత్ విఫలమైందని తెలుస్తోంది. స్వచ్ఛభారత్ సెస్ పేరుతో ప్రజలను కేంద్రం దోచుకుంటోంది’ అని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ ఆరోపించారు. రాష్ట్ర విపక్ష నేతలు ఈ ఘటనను ఆయుధంగా మలచుకొని మంత్రిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles