TRS leader shuns second wife over third marriage టీఆర్ఎస్ నేత ‘‘కళ్యాణ వైభోగమే’’

Trs neta family beat wife after she creates ruckus over his second marriage

TRS leader, P Srinivas Reddy, Sangeetha, medipally police, rachkonda police, marriage, Telangana, domestic voilence, physical assault, abusing wife

A leader of the ruling TRS party, P Srinivas Reddy was caught on camera beating and abusing his second wife, Sangeetha, after she protested against his third marriage in front of his residence.

మూడో పెళ్లిళ్లు.. ఆరు కలహాలు.. టీఆర్ఎస్ నేత భాగోతం..?

Posted: 11/20/2017 02:08 PM IST
Trs neta family beat wife after she creates ruckus over his second marriage

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల అగడాలు శృతిమించుతున్నాయని ఓ వైపు విపక్ష నేతలు అరోపిస్తున్న క్రమంలో ఓ యువనేత భాగోతం బట్టబయలైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా తన జీవినం సాగిస్తూ.. అధికార పార్టీలో యువనేతగా చలమాణి అవుతున్న నేత.. తన కొత్తగా వచ్చిన భార్య కోసం.. పాత భార్యపై కర్కషంగా వ్యవహరించాడు. మూడవ పెళ్లి ఎలా చేసుకున్నావ్ అని అడిగిన పాపానికి అమెకు ప్రత్యక్ష నరకమంటే ఏంటో అర్థమయ్యేలా చేసిచూపాడు.

తన భార్యే కదా అన్న కనీసం ఇంకితాన్ని మర్చిపోయిన నేత.. అమెను నేలకేసి బలంగా విసిరేశాడు. అడపిల్లకు జన్మనిచ్చిందని, అదనపు కట్నం కావాలని డిమాండ్  చేస్తూ అమెను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. అత్తింటి వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో మొత్తంగా యువనేత భాగోతం బయటపడింది.. తనకు విడాకులివ్వకుండా ఎలా పెళ్లి చేసుకున్నావని నిలదీసినందుకు తనను, తనతో పాటు తన సోదరుడ్ని, తల్లిపై కూడా విచక్షణారహితంగా దాడి చేశాడు. రాచకొండ కమిషనరేట్లోని మేడిపల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. బోడుప్పల్‌ శ్రీనగర్ కాలనీలో నివసించే శ్రీనివాస్‌రెడ్డి తన మొదటి భార్య స్వాతిని వివాహం చేసుకున్నా.. మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. ఆ తరువాత 2013 అక్టోబర్‌ 19న శేరిలింగంపల్లికి చెందిన సంగీతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల పాటు బాగానే సాగిన దాంపత్యంలో అత్తామామల నుంచి కట్నం వేధింపులు ప్రారంభమయ్యాయి. సంగీతను శారీరకంగా, మానసికంగా వేధించారు. అయితే అడపిల్ల పుట్టిన తరువాత భర్త నుంచి కూడా అదే వేధింపులు ఎదురుకావడంత.. భరిస్తూ వచ్చిన అమె.. సహనం నశించి ఈ ఏడాది జూన్‌ 13న చందానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అప్పటి నుంచి అమె పుట్టింట్లోనే వుంటుంది. ఈ క్రమంలో దేవిజగదీశ్వరి(20)ని ఆగస్ట్‌ 11న శ్రీనివాస్‌రెడ్డి మూడో పెళ్లి చేసుకున్నాడు. భర్త పెళ్లి గురించి వార్త తెలియడంతో.. తన నుంచి విడాకులు తీసుకోకుండా ఎలా పెళ్లి చేసుకుంటావని సంగీత భర్త ఇంటికి వెళ్లి నిలదీసింది. అమెకు తోడుగా అమె సోదరుడు, తల్లి కూడా వెళ్లారు. అయితే వారిపై విచక్షణా రహితంగా దాడి చేసిన శ్రీనివాస్ రెడ్డి.. వారిని ఇంటి నుంచి బయటకు గెంటివేశాడు. దీంతో మేడిపల్లి పోలీసులను అశ్రయించిన అమె తన భర్తపై పిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన మహిళా సంఘాల సహాకారంతో అమె భర్త ఇంటి వద్దే నిరహార దీక్షకు పూనుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles