NCP to contest Gujarat elections solo ఆ ఇద్దరి మిత్రులదీ.. ఇకపై ఎవరి దారివారిదే..

Ncp takes u turn in gujarat snaps alliance with congress

Congress, Gujarat Assembly Elections, NCP, Sharad Pawar, Gujarat Election 2017, BJP, Praful Patel, gujarat politics, gujarat assembly polls, PM Modi, Amit Shah, Jay shah, Rahul Gandhi, Sharad pawar, politics

The NCP is unlikely to cement the alliance with Congress for Gujarat assembly elections, said Senior party leader Praful Patel citing that Congress has not given them enough numbers of seats.

ఆ ఇద్దరి మిత్రులదీ.. ఇకపై ఎవరి దారివారిదే..

Posted: 11/20/2017 12:49 PM IST
Ncp takes u turn in gujarat snaps alliance with congress

గుజరాత్‌ ఎన్నికలకు లౌకికవాద పార్టీలన్ని సమైక్యంగా బీజేపిని ఓడించేందుకు జతకట్టాల్సిన అవసరముందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపి) అధ్యక్షుడు శరద్ పవార్ ప్రటించిన మరుసటి రోజునే ఆ పార్టీకి చెందిన కీలక నేత ప్రఫూల్ పటేల్ మాత్రం తాము గుజరాత్ ఎన్నికలలో ఒంటరిగానే పోరాడదల్చుకున్నామని కుండబద్దలు కొట్టారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో అనుసరించిన మార్గానే గుజరాత్ ఎన్నికలలో కూడా ఫాలో అవుతామని చెప్పారు.

తమ మిత్రుడిగా భావిస్తున్న కాంగ్రెస్ తమకు అశించిన సంఖ్యలో సీట్లను కేటాయించడం లేదని, తాము గుజరాత్ లో కాంగ్రెస్ తో కలసి పెరిగేందుకు మోకాలడ్డుతుందని ఆయన ఆక్షేపించారు. దీంతో కాంగ్రెస్‌తో కలిసి మిత్రపక్షంగా బరిలో దిగుతామని భావించినా.. చివరకు తాము ఒంటిరగానే బరిలో దిగుతామని ఇవాళ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) ఓ ప్రకటన వెలువరించింది.

గత ఎన్నికలలో తమకు ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వున్నారని, కాగా మరికొందరు స్వల్ప ఓట్లతేడాతో ఓటమిని చవిచూశారని, దీంతో తమకు కనీసం 10 అసెంబ్లీ స్థానాలైనా కేటాయించాలని కాంగ్రెస్ ను కోరితే కేవలం నాలుగు సీట్లను మాత్రమే ఇస్తామని తేగేసి చెప్పడంతో పాటు తమకు ఓ వైపు చర్చలు సాగుతున్న క్రమంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంపై కూడా అయన అగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాము సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

దేశ ప్రధాని నరేంద్రమోడీకి చెందిన రాష్ట్రం కావడంతో ఇక్కడి ఎన్నికలపై యావత్ ప్రపంచం దృష్టి కేంద్రీకరించబడి వుందని అన్నారు. అయితే గుజరాత్ కు చెందిన ఓ కాంగ్రెస్ నేత మాట్లాడుతూ.. గుజరాత్ లో ఎన్సీపికి బలమే లేదని అన్నారు. ఇక ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కు ఎన్సీపికి చెందిన ఓ ఎమ్మెల్యే ఓటు వేయలేదని, అత్యంత కీలకసమయాల్లో మిత్రధర్మం మర్చిపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.  కాగా డిసెంబర్‌ 9, 14 తేదీల్లో రెండు దఫాలుగా గుజరాత్‌ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles