government to inplement free medical sevrices at doorstep ఉచిత వైద్య పథకం: పేషంటు వద్దకే సేవలు

Government to implement free medical sevrices at doorstep

government scheme, free medical aid scheme, free medical tests, door steps, rajeevi arogyasri, medical scheme to telanganaites, telangana, CM KCR, corporate hospital

telangana government to impliment another free medical scheme for people who are suffering from non communicable diseases

ఉచిత వైద్య పథకం: పేషంటు వద్దకే సేవలు

Posted: 11/18/2017 11:59 AM IST
Government to implement free medical sevrices at doorstep

రాజీవ్ అరోగ్య శ్రీ పథకం పేరుతో సామాన్యులకు అందుబాటులోకి కార్పోరేట్ వైద్యాన్ని తీసుకువచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రె్డ్డి తరహాలోనే ప్రజల మనస్సులో నిత్యం కొలువుండే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో పథకాన్ని రూపకల్పన చేస్తున్నారు. అటు వైద్య విధానాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే.. ఇటు వైద్య రంగంలో పలు సేవలను ప్రజల వద్దకే తీసేకెళ్లే విధంగా పథకాన్ని రచిస్తున్నారు.

శిశువులకు జన్మనిచ్చిన తల్లులకు అందించే కేసీఆర్‌ కిట్‌ తరహాలోనే బీపీ, షుగర్ సమస్యలతో బాధపడుతున్న వారి కోసం అంటువ్యాదులు కానీ రోగాలకు పరీక్షలు చేసుకునేందుకు సంబంధించిన కిట్లను ప్రవేశపెట్టాలని సంకల్పించింది. ఈ పథకాన్ని వచ్చే ఏడాది జనవరి 26 నుంచి అమలు చేయాలని కూడా నిర్ణయించినట్టు సమాచారం. ఈ పథకం అమలులో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో వైద్య బృందాలు ఇంటింటికి వెళ్లి బీపీ, షుగర్‌ పరీక్షలు నిర్వహిస్తాయి. బాధితులను గుర్తించి వారికి ఉచితంగా ఈ వైద్య కిట్లను అందజేస్తారు.

నెలకు సరిపడా మందులు వున్న ఈ కిట్లతో పాటు వ్యాధిగ్రస్తుల వివరాలను కూడా సేకరించి వాటిని ఆన్ లైన్ లో ఉంచుతారు. అలాగే మూడు నెలలకోసారి బాధితులను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు. అక్కడ క్రియాటిన్‌, షుగర్‌, బీపీ పరీక్షలు చేస్తారు. ఫలితాల ఆధారంగా ఇచ్చే మందుల్లో ఏవైనా మార్పులు, చేర్పులు చేస్తారు. ఎన్‌సీడీ కిట్లలో ఇచ్చే బీపీ, షుగర్‌ మందులు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల మేరకే ఉంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : government scheme  free medical aid scheme  free medical tests  door steps  telangana  

Other Articles