Ramalinga Reddy draws controvery అమ్మాయిలూ.. మీకు రాత్రి పూట రోడ్లపైన పనేంటి.?

Home minister r ramalinga reddy controversial staments

Home Minister, R Ramalinga Reddy, controversial staments, young women, cctv cameras, women safety, women at night, karnataka

Home Minister R Ramalinga Reddy has tabled the bill which was passed in the Legislative Council, and makes it mandatory for owners of the establishments to provide video footage from the CCTV cameras, if sought by security agencies for investigation purpose.

అమ్మాయిలూ.. మీకు రాత్రి పూట రోడ్లపైన పనేంటి.?

Posted: 11/18/2017 10:24 AM IST
Home minister r ramalinga reddy controversial staments

అమ్మాయిలకు రాత్రి పూట రోడ్లపై పనేంటి..? అంటూ మళ్లీ అదే పాతధోరణిలో ప్రశ్నలు సంధిస్తున్నారు రాజకీయ నాయకులు. అమ్మాయిలు మాత్రమే వున్న కుటుంబంలో తంత్రి మంచానికే పరిమితం అయితే ఆ ఇంట్లో పూట గడవాలంటే ఎవరు పనిచేయాలి..? రాత్రి ఉద్యోగాల నుంచి తిరిగి వచ్చే సమయంలో అమెకు వెంట ఎవరు రావాలి..? ఈ ప్రశ్నలకు నేతలే సమాధానం చెబితే మంచిది. మొన్న బీజేపికి చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అంతకుముందు మరో రాష్ట్ర బీజేపి మంత్రి ఇలాంటి వ్యాఖ్యలే చేసి ప్రజల నుంచి వమర్శలు ఎదుర్కొన్న తరువాత ఇప్పుడావంతు కర్ణాటక హోం మంత్రి రామలింగారెడ్డి కి వచ్చింది.

పెరుగుతున్న నేరాలను అదుపు చేయడంతో ప్రభుత్వాలు విఫలవుతుండటంతో చేసిది లేక.. మగపైశాచిక మృగాలను అదుపు చేయలేక అసలు అమ్మాయిలకు రాత్రి పూట రోడ్లపై పనేంటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు దేశంలోనే శరవేగంగా ఐటీ రంగంలో దూసుకెళ్లూ సైబర్ నగరంగా గుర్తింపు తెచ్చుకుంటున్న బెంగళూరులో మంత్రి మరో అడుగు ముందుకేసీ అమ్మయాలపై అంక్షలు విధించారు. శాసనమండలిలో 'మహిళా భద్రత'పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, అమ్మాయిలకు రాత్రిపూట రోడ్లపై పని ఉండదు కనుక, ఇకపై రాత్రివేళ బెంగళూరు రోడ్లమీద వాళ్లు కనిపించకూడదని అన్నారు.

ఇక రాత్రివేళ ఆఫీసుకు వెళుతున్న మహిళలకు తోడుగా బంధువులను, లేదా కుటుంబసభ్యులను తీసుకెళ్లాలని ఉచిత సలహా ఇచ్చేశారు. మరి బంధువులకు, కుటుంబసభ్యులకు దూరంగా ఎక్కడి నుంచో వలసవచ్చిన యువతులకు ఎవరు తోడుగా వెళ్లాలన్న ప్రశ్నలు మంత్రికి వ్యతరికంగా ఉత్పన్నమవుతున్నాయి. బెంగళూరులో వున్న కోటి ఇరవై లక్షల మందికి.. వేల సంఖ్యలో వున్న పోలీసులు ఎలా భద్రత కల్పించగలరని కూడా ఆయన ఎదురు ప్రశ్నించారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. చేతకానప్పుడు బాధ్యతల్లో కొనసాగడం ఎందుకని పలువురు మహిళా సంఘాల నేతలతో పాటు, ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles